HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # PM Modi
  • # Chandrayaan
  • # Uniform Civil Code
  • # KCR
  • # Congress

  • Telugu News
  • ⁄Andhra Pradesh
  • ⁄Now Its Ap Government Turn To Attack Centre

కేంద్రం పై జగన్,కేసీఆర్ ,’ముందస్తు’ఫైట్

తెలంగాణ సిఎం కేసీఆర్ తరహాలోనే జగన్ సర్కార్ బీజేపీ పై తిరగబడేందుకు సిద్దం అవుతుంది. పెట్రోల్. డీజిల్ పై వ్యాట్ ను తగ్గించడానికి ఇరు తెలుగు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి.

  • By CS Rao Published Date - 12:41 PM, Tue - 9 November 21
  • daily-hunt
కేంద్రం పై జగన్,కేసీఆర్ ,’ముందస్తు’ఫైట్

తెలంగాణ సిఎం కేసీఆర్ తరహాలోనే జగన్ సర్కార్ బీజేపీ పై తిరగబడేందుకు సిద్దం అవుతుంది. పెట్రోల్. డీజిల్ పై వ్యాట్ ను తగ్గించడానికి ఇరు తెలుగు రాష్ట్రాలు ససేమిరా అంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెస్ రూపంలో దోచుకుంటుందని ఆరోపిస్తూ ఆందోళన బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈనెల 11న కేసీఆర్ సర్కార్ పెట్రోలు బంకుల వద్ద ధర్నాకు పిలుపు ఇచ్చింది. ఆ మేరకు ఆందోళన బాట పట్టనప్పటికీ కేసీఆర్ తో వాయిస్ వైసీపీ సర్కార్ కలిపింది. ఇరు రాష్ట్రాలలోని విపక్షాలు వ్యాట్ ను తగ్గించాలని పోరు బాట పట్టాయి. ఏపీలో ఈ నెల 9న ధర్నాలు నిర్వహించాలని పిలుపు నిచ్చాడు. ఆ లోపు మంత్రులు కేంద్రం సెస్ దోపిడీని వివరిస్తూ మీడియా కు ఎక్కారు.


రాష్ట్ర సర్కార్ల పై విపక్షాలు ఆందోళనకు సిద్దం అవుతుంటే, ప్రభుత్వాలు కేంద్రంపై పోరాటాలకు సిద్దం కావడం విచిత్ర పరిణామం. వాస్తవంగా అంతర్జాతీయ మార్కెట్ల లో క్రూడ్ ఆయిల్ ధర 2017 మాదిరిగా ఉంది. ఆ ప్రకారం లీటర్ పెట్రోల్ సుమారు 70 రూపాయలకు ప్రజలకు ఇవ్వాలి. కానీ , కేంద్రం పన్నులు, రాష్ట్రం వ్యాట్ కలుపుకుని సుమారుగా 115 వరకు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ భారాన్ని మోయలేని ప్రజలు బీజేపీ పార్టీని ఉప ఎన్నికల్లో తిరస్కరించారు. వెంటనే నష్ట నివారణగా పెట్రోలు పై 5 రూపాయలు, డీజిల్ పైన 10 రూపాయలు లీటరు కు తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రాష్ట్రాలు కూడా వ్యాట్ తగ్గించుకోవాలి అని కేంద్రం లోని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 10 రాష్ట్రాలు పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలు మాత్రం అందుకు అంగీకరించటం లేదు. పైగా కేంద్రం సెస్ వసూ లు చేయడం ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రాలు ఆలోచంచక పోవడం దురదృష్టం. విపక్షాలు కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని పోరాటం కరెక్టు గా చేయలేకపోడం గమనార్హం.

Also Read : రైలుని ఆక‌స్మిక త‌నిఖీ చేసిన ఎస్పీ సిద్దార్థ కౌశల్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇంధన ధరలు, వరి కొనుగోలుపై భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాడు. మరుసటి రోజు, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్రాన్ని టార్గెట్ చేయడం ప్రారంభించింది. ఈ పరిణామం కేంద్రానికి ఒకింత ఇబ్బంది గా ఉంది.ఇంధన ధరల తగ్గింపు పేరుతో కేంద్రం ప్రజలను మోసం చేసి, వ్యాట్ తగ్గించాలని రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకువస్తోందని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డాడు.పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 తగ్గించి కేంద్రం ఇచ్చిన ఉపశమనం గత ఏడేళ్లలో ఇంధనంపై సెస్‌ రూపంలో వసూలు చేసిన దానితో పోలిస్తే చాలా తక్కువ అని సజ్జల అన్నారు.

Also Read :  చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే

ఇంధన ధరల నుండి కేంద్రం దాదాపు రూ. 3.60 లక్షల కోట్లు వసూలు చేసింది, అందులో దాదాపు రూ. 3.13 లక్షల కోట్లు సెస్ రూపంలో జేబులో వేసుకుంది. ఎక్సైజ్ సుంకం రూపంలో కేవలం రూ. 47,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి, అందులో కేవలం రూ. 19,475 కోట్లు మాత్రమే పన్నుల పంపిణీ రూపంలో రాష్ట్రాలతో పంచుకోబడ్డాయి, ”అని ఆయన ఎత్తి చూపారు.రాష్ట్ర ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ ఇప్పటికే బహిరంగ ప్రకటన చేశామని, రాష్ట్ర ప్రభుత్వం పడుతున్న కష్టాలను అర్థం చేసుకుంటామని సజ్జల స్పష్టం చేశారు.పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం విధించిన వ్యాట్‌ను తగ్గించే ప్రశ్నే లేదని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.
మేము తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రతి రాష్ట్రానికి దాని స్వంత నిర్బంధాలు మరియు అవసరాలు ఉంటాయి. ఇంధనంపై వ్యాట్ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది, మేము దానిని వదులుకోలేము, ”అని ఆయన నొక్కి చెప్పారు.

Also Read : కొండ‌చిలువ‌ను ముద్దుపెట్టుకున్న మ‌హిళ‌.. వీడియో వైర‌ల్‌

రాష్ట్రంలో ఇంధన ధరలపై బీజేపీ హల్ చల్ చేస్తోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు.’ఒక ఏడాది వ్యవధిలో పెట్రోల్ ధరను రూ.70 నుంచి రూ.115కి పెంచింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే. ఇప్పుడు అదే బీజేపీ నేతలు రాష్ట్ర పన్నును తగ్గించకుండా మమ్మల్ని తప్పుబడుతున్నారు’’ అని విమర్శించారు.ఇలా మంత్రులు కేంద్రం పై విరుచుకు పడుతున్నారు. ఇదంతా కేసీఆర్ నడిపిస్తున్న రాజకీయంగా బీజేపీ స్థానిక నేతలు అభిప్రాయ పడుతున్నారు. మళ్ళీ ఫెడరల్ ఫ్రంట్ వైపు అడుగులు వేస్తున్న కేసీఆర్ ముందస్తు వైపు దూకుడు పెంచడాని కొందరు అంచనా వేస్తున్నారు. ఇలాగే కేంద్రం పై రాబోవు రోజుల్లో దూకుడు పెంచి ముందస్తుకు జగన్ , కేసీఆర్ కలసి వెళ్తారని మరో వాదన ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తుంది. ఇదే నిజం ఐతే 2022 డిసెంబర్ లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రద్దు అయ్యే అవకాశం లేకపోలేదు. సో ముందస్తుకు సంకేతంగా పెట్రోల్, డీజిల్ సెస్ ఫైట్ అన్నమాట.

Tags  

  • andhra pradesh
  • perni nani
  • petrol rates in india
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

Motkupalli : జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే జ‌గ‌న్ బాధ్య‌త వ‌హించాలి : మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

Motkupalli : జైల్లో చంద్రబాబుకు ఏమైనా అయితే జ‌గ‌న్ బాధ్య‌త వ‌హించాలి : మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

చంద్ర‌బాబు అరెస్ట్ పై తెలంగాణ సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు స్పందించారు.

  • Chandrababu CID Interrogation : చంద్రబాబు పై CID ప్రశ్నల వర్షం..ఆ 15 కీలకం

    Chandrababu CID Interrogation : చంద్రబాబు పై CID ప్రశ్నల వర్షం..ఆ 15 కీలకం

  • CID : రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుని విచారిస్తున్న సీఐడీ

    CID : రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుని విచారిస్తున్న సీఐడీ

  • Chandrababu : నేడు సీఐడీ క‌స్ట‌డీకి చంద్ర‌బాబు.. విచారించ‌నున్న 9 మంది సీఐడీ అధికారులు

    Chandrababu : నేడు సీఐడీ క‌స్ట‌డీకి చంద్ర‌బాబు.. విచారించ‌నున్న 9 మంది సీఐడీ అధికారులు

  • JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జ్యుడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల..?

    JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జ్యుడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల..?

Latest News

  • Video: ఐఫోన్-15 కోసం గొడవ.. వీడియో వైరల్

  • Vande Bharat Express: ఒకేసారి 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్న మోడీ

  • India vs Canada: భారత్ వర్సెస్ కెనడా.. పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలు

  • Singireddy Niranjan Reddy: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై విపక్షాల విషప్రచారం!

  • MLC Kavitha: 26న జలవిహార్ లో బీసీ సంఘం సమావేశానికి మద్దతు: ఎమ్మెల్సీ కవిత

Trending

    • Countdown for Jagan : టీడీపీకి మంచిరోజులు.! జ‌గ‌న్ పై మోత్కుప‌ల్లి తిరుగుబాటు !!

    • Diamond Ganesh: గుజరాత్ లో వజ్రాల వినాయకుడు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

    • Sonic Rocket Vs Monkey Problem : కోతులను తరిమికొట్టే సోనిక్ రాకెట్.. ఇండియా సైంటిస్టు ఆవిష్కరణ

    • Jagan Reverse Attack : చంద్ర‌బాబుపై రివ‌ర్స్ స్కెచ్ వేసిన జ‌గ‌న్

    • BJP Operation Garuda : ఆంధ్రోడా మేలుకో.!బీజేపీ ప్లాన్ ఇదే..!

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • PM Modi
  • Chandrayaan
  • Uniform Civil Code
  • kcr
  • Congress

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version