రైలుని ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ సిద్దార్థ కౌశల్
అమరావతి రాష్ట్రంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుంది.ఈ అక్రమ రవాణాని అరికట్టేందకు పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే ఆదివారం మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో కృష్ణాజిల్లా ఎస్పీ సిదార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు
- By Hashtag U Published Date - 04:36 PM, Mon - 8 November 21

అమరావతి రాష్ట్రంలో ఇటీవల కాలంలో విచ్చలవిడిగా గంజాయి అక్రమంగా రవాణా జరుగుతుంది.ఈ అక్రమ రవాణాని అరికట్టేందకు పోలీసులు పెద్ద ఎత్తున స్పెషల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగానే ఆదివారం మచిలీపట్నం రైల్వే స్టేషన్ లో కృష్ణాజిల్లా ఎస్పీ సిదార్థ కౌశల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ నుంచి రైలుని నిర్ణీత సమయానికి బయల్దేరకుండా రైల్వే సిబ్బంది మాట్లాడి ఆపారు. మధ్యాహ్నం 3.15 గంటలకు స్టేషన్ నుండి బయటకు వెళ్లడానికి సిగ్నల్‌ను ఆపాలని డీఎస్పీ రైల్వే పోలీసులను ఆదేశించారు.రైలు ఆగిన తరువా తరువాత ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ రైలు లోపల తనిఖీలు చేశారు.ఈ రైలు మచిలీపట్నం-సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్..దీనని దాదాపుగా 15 నిమిషాలకు పైగా నిలిపివేశారు. రైలులో అనుమానాస్పద వస్తువులు, అనుమానస్పద వ్యక్తులు ఉన్నట్లు నివేదికలు వచ్చాయని…ప్రయాణీకుల భద్రతను నిర్ధారించే తనిఖీలో భాగంగా ఇది జరిగిందని ఎస్పీ కౌశల్ తెలిపారు. ప్రయాణికులకు ఎవరికీ అసౌకర్యం కలగకుండా తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి సాగుకు రాష్ట్రం ప్రధాన కేంద్రంగా మారిందని తేలడంతో గంజాయి స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇటీవలి రోజుల్లో వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 283 కేసులు నమోదు కాగా, గంజాయి తీసుకెళ్తున్న 763 మందిని అరెస్టు చేసినట్లు డీజీపీ కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. 9,266 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
Related News

Pawan Kalyan: రైల్వేలో అర్హత సాధించిన యువతకు ఉద్యోగాలు కల్పించాలి: పవన్ కళ్యాణ్
సి.సి.ఎ.ఎ. అర్హత సాధించినవారికి ఉద్యోగాలు కల్పించాలి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.