Sharmila : జగన్ పాలనలో మైనార్టీలకు రక్షణ లేదు..? ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలి: షర్మిల
అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు.
- Author : Vamsi Chowdary Korata
Date : 27-01-2024 - 2:03 IST
Published By : Hashtagu Telugu Desk
Sharmila : అమరావతిః గుంటూరులోని మెట్టు అంజిరెడ్డి కల్యాణ మండపంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ..రాష్ట్రంలో యువతను నిరుద్యోగులుగా మార్చి, పోలవరం నిర్మాణం ఆపేసి, అభివృద్ధిని పక్కన పెట్టిన జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో గుంటూరు గుంతలూరుగా మారిందని ఎద్దేవా చేశారు. గుంటూరులో మంచి రహదారులు రావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లేవన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల కాలంలో ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వకుండా ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to join.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, ఇంక అభివృద్ధికి నిధులు ఎక్కడ వస్తాయని ప్రశ్నించారు. రాజశేఖర్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారని, జగన్ మాత్రం పెద్ద పెద్ద గోడలు కట్టుకోని కోట లోపలే ఉంటున్నారని ఎద్దేవా చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు ఇంకా ప్రజలను ఎలా కలుస్తారని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు విషయంలో వైఎస్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లి పోరాడి సాధించారని, జగన్ పాలనలో మాత్రం రాష్ట్రంలో మైనార్టీలకు రక్షణ లేదని విమర్శించారు. మణిపూర్లో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నా జగన్ స్పందించలేదని, జగన్ బిజెపికి బానిసలా మారిపోయారని దుయ్యబట్టారు.
ముస్లింలు, క్రిస్టియన్స్కు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని విమర్శించారు. పోలవరం, ప్రత్యేక హోదా ఇవ్వక పోయినా వైసీపీ మాత్రం బిజెపికి ఊడిగం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి గడపా తొక్కుతా, వీలైనంత ఎక్కువ మందిని కలుస్తానని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైన్యంలా మారాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వైసీపీ, జనసేన, టిడిపిలలో ఎవరికి ఓటు వేసినా బిజెపికి వేసినట్లేనన్నారు. బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మస్తాన్ వలి, ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ప్రాజెక్టును నిర్మించారన్న షర్మిల (Sharmila), గేట్లు కొట్టుకు పోతుంటే ఇరిగేషన్ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించిన ప్రాజెక్టును ఈ ప్రభుత్వం గాలికి వదిలేసిందని షర్మిల ఆరోపించారు. నిర్వహణ లేకనే గేట్లు కొట్టుకు
Also Read: Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్‌లో ఈ 4 అంశాలపై ప్రభుత్వం దృష్టి..!