Nara Lokesh: సౌదీ అరేబియాలో చిక్కుకున్న వీరేంద్ర, రంగంలోకి మంత్రి లోకేష్
ఏజెంట్ ద్వారా వీరేంద్ర సౌదీ వెళ్లాలనుకున్నాడు. ఇంట్లో వంట చేసే పని కోసం అతనిని రప్పించాడు. అయితే అక్కడికి వెళ్లిన వీరేంద్రకు షాక్ తగిలింది. అతన్ని ఎడారిలో ఒంటెలకు కాపలాగా ఉంచారు. ఏజెంట్ ఒక లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకుని మోసం చేసి ఎడారిలో వదిలేశాడని వాపోతున్నారు వీరేంద్ర
- By Praveen Aluthuru Published Date - 03:50 PM, Sat - 20 July 24

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఓ యువకుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరేంద్ర అనే వ్యక్తి తనను సౌదీ అరేబియా నుంచి వెనక్కి తీసుకురావాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ధైర్యంగా ఉండాలని సూచించారు. తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు లోకేష్.
ఆంధ్రప్రదేశ్, కోనసీమ జిల్లాలోని ఇసుక పూడి గ్రామానికి చెందిన వీరేంద్ర కుమార్ వయస్సు 23 ఏళ్లు. వీరేంద్ర 2024 జూలై 10న తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి ఓ ఏజెంట్ ద్వారా ఖతార్ వెళ్లాడు. ఆ తర్వాత అతనిని సౌదీ అరేబియాకు తీసుకెళ్లి ఎడారిలో ఒంటెలను మేపుకునే పనిలో పెట్టాడు.
#Kuwait లో ఏజెంట్ చేతిలో మోసపోయి , అతి దుర్బరమయిన జీవితం అనుభవిస్తున్న ఒక తెలుగువాడు, నాకు సాయం చెయ్యకపోతే నాకు చావు తప్ప ఇంకో దిక్కులేదు అని చెప్తున్నాడు. దయచేసి ఈ వీడియో సంబంధిత అధికారులకి చేరేలాగా చెయ్యండి@ncbn @naralokesh @PawanKalyan @RamMNK @ByreddyShabari @Anitha_TDP pic.twitter.com/r8PfKCiaVW
— Milagro Movies (@MilagroMovies) July 13, 2024
సమాచారం ప్రకారం ఒక ఏజెంట్ ద్వారా వీరేంద్ర సౌదీ వెళ్లాలనుకున్నాడు. ఇంట్లో వంట చేసే పని కోసం అతనిని రప్పించాడు. అయితే అక్కడికి వెళ్లిన వీరేంద్రకు షాక్ తగిలింది. అతన్ని ఎడారిలో ఒంటెలకు కాపలాగా ఉంచారు. ఏజెంట్ ఒక లక్షా డెబ్బై వేల రూపాయలు తీసుకుని మోసం చేసి ఎడారిలో వదిలేశాడని వాపోతున్నారు వీరేంద్ర కుటుంబ సభ్యులు. అయితే వీరేంద్ర వీడియో చూసిన నారా లోకేష్ చలించిపోయారు. వీరేంద్రకు ధైర్యం చెప్పారు. అతనిని ఏపీకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. కాగా నారా లోకేష్ హామీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ఓ వ్యక్తిని ఇలానే కాపాడిన లోకేష్ తాజాగా వీరేంద్ర విషయంలో స్పందించడం గమనార్హం.
వైరల్ వీడియో చూస్తే వీరేంద్ర అక్కడ ఎంత బాధపడుతున్నాడో అర్ధం అవుతుంది.సెల్ఫీ వీడియోలో అతను నిస్సహాయంగా, అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. ఎడారిలో నిలబడిన వీరేంద్ర తనకు తిండి, నీళ్లు కూడా దొరకడం లేదని చెప్పాడు. అతని ఆరోగ్యం కూడా చాలా విషమంగా ఉంది.ఎడారిలో తనకు ఎలాంటి సాయం అందడం లేదన్నారు.మరో వీడియో బయటకు రావడంతో వీరేంద్ర కుటుంబ సభ్యులు చాలా కలత చెందుతున్నారు.
Also Read: Group 2 Postpone : నాలుగు వందల కోట్ల కోసం సీఎం గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా వేశాడా..? కేటీఆర్ సూటి ప్రశ్న