Group 2 Postpone : నాలుగు వందల కోట్ల కోసం సీఎం గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా వేశాడా..? కేటీఆర్ సూటి ప్రశ్న
ఒక్కనెల ఎగ్జామ్ వాయిదా పడితే.. కోచింగ్ సెంట్లర్లు వందల కోట్ల లాభాలు గడిస్తాయని సీఎం రేవంత్ అన్నారు
- By Sudheer Published Date - 03:37 PM, Sat - 20 July 24

తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలను (Group 2 Postpone) తెలంగాణ సర్కార్ (Telangana Govt) వాయిదా వేసింది. ఈ పరీక్షలను డిసెంబరులో నిర్వహించనున్నట్లు TGPSC నుంచి అధికారికంగా ప్రకటన చేసింది. ఆగస్టు 7,8 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబర్‌కు వాయిదా వేసింది. టీజీ డీఎస్సీ, గ్రూప్-2 పరీక్షల మధ్య వారం వ్యవధి మాత్రమే ఉందని.. ఈ నేపథ్యంలో అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్-2 వాయిదా వేసినట్లు TGPSC తెలిపింది. పరీక్షల వాయిదా ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..సీఎం రేవంత్ ఫై సెటైర్లు వేశారు.
We’re now on WhatsApp. Click to Join.
రీసెంట్ గా కోచింగ్ సెంటర్ల ఫై సీఎం రేవంత్ (CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ (KTR) గుర్తు చేసారు. నిరుద్యోగుల వెనుక రాజకీయ శక్తులున్నాయని, కొందరు కోచింగ్ సెంటర్ మాఫీయాలు నిరుద్యోగులను రెచ్చగోడుతున్నారంటూ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసారు. కొందరు కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కావాలనే.. కిరాయి మనుషుల్ని పెట్టీ మరీ నిరసలను చేయిస్తున్నారని , గ్రూప్స్ కోచింగ్ అనేది ఒక బిజినెస్ లాగా మారిపోయిందని, ఒక్కనెల ఎగ్జామ్ వాయిదా పడితే.. కోచింగ్ సెంట్లర్లు వందల కోట్ల లాభాలు గడిస్తాయని సీఎం రేవంత్ అన్నారు. వాళ్లు డబ్బులు సంపాదించడానికే ఈ విధంగా విద్యార్థులను రెచ్చగొడుతున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలఫై తాజాగా కేటీఆర్ స్పందించారు.
ఒక్కనెల ఎగ్జామ్ వాయిదా పడితే.. కోచింగ్ సెంట్లర్లు వందల కోట్ల లాభాలు గడిస్తాయని సీఎం రేవంత్ అన్నాడు..మరి ఈరోజు నాల్గు నెలల పాటు గ్రూప్ ఎగ్జామ్స్ వాయిదా వేశారు. అంటే నాల్గు వందల కోట్లు కాంగ్రెస్ పార్టీకి అందాయా..? అందుకే వాయిదా వేసారా..? ఇందులో సీఎం రేవంత్ వాటా ఎంత..? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు.
పరీక్షలు వాయిదా వేస్తే కోచింగ్ సెంటర్లకు వందల కోట్లు లాభం వస్తుందని మొన్న రేవంత్ రెడ్డి అన్నాడు.
మరి ఇప్పుడు నాలుగు నెలలు వాయిదా వేశారు.. నాలుగు వందల కోట్లు వస్తున్నాయా? అందులో రేవంత్ వాటా ఎంత?
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS. pic.twitter.com/m6cjiVmV6g
— BRS Party (@BRSparty) July 20, 2024
Read Also : Rajiv Gandhi Civil Abhaya Hastham : ‘రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం’ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్