Yuvagalam Padayatra: అక్కడ ఓటరు దేవుళ్ళు నాపై కనికరించలేదు
నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో సాగుతుంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రాజకీయాల్లో జయాపజయాలు సహజమని అన్నారు
- Author : Praveen Aluthuru
Date : 16-08-2023 - 7:36 IST
Published By : Hashtagu Telugu Desk
Yuvagalam Padayatra: నారా లోకేష్ యువగలం పాదయాత్ర ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో సాగుతుంది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… రాజకీయాల్లో జయాపజయాలు సహజమని అన్నారు. 2019లో మంగళగిరి ఓటర్లు నాపై కరుణ చూపలేదని చెప్పారు గత ఎన్నికల్లో ఓడినా ప్రజలమధ్యే ఉంటూ ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ వారి వెన్నంటే ఉన్నానని అన్నారు నారా లోకేష్. గత నాలుగేళ్లుగా అధికారపార్టీ చేయలేనన్ని కార్యక్రమాలు మంగళగిరిలో చేసి చూపించానని లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరిలో నా వ్యక్తిగత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేశానని తెలిపారు.
జలధార వాటర్ ట్యాంకర్లు,ఆరోగ్యరథాలు, అన్నాక్యాంటీన్లు, స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు కుట్టుమిషన్లు, చిరువ్యాపారులకు తోపుడుబళ్లు, చేనేతలకు రాట్నాలు, స్వర్ణకారులకు పనిముట్లు, వికలాంగులకు ట్రైసైకిళ్లు, పాదచారులు సేదదీరేందుకు సిమెంటు బల్లలు… ఇలాంటి 27సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు లోకేష్ అధికారం చేపట్టిన నాలుగేళ్లలో నువ్వేం చేశావ్… ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు గత ప్రభుత్వం అమలుచేసిన 100 సంక్షేమ పథకాలను రద్దుచేశావని ఆరోపించారు. అన్నాక్యాంటీన్లు రద్దుచేసి పేదల నోళ్లు కొట్టావని ధ్వజమెత్తారు… బుల్డోజర్లు పంపించి రాత్రికి రాత్రే పేదల గూళ్లను కూల్చేశావని విమర్శించారు… 6లక్షల అవ్వాతాతల పెన్షన్లు తీసేసి పండుటాకుల ఉసురుపోసుకున్నావని సీఎం జగన్ ని ఉద్దేశించి ఫైర్ అయ్యారు. చేసిన పాపాలు కప్పిపుచ్చుకోవడానికి ప్యాలస్ నుంచి బయటకు రావాలంటే వందలాది పోలీసులు, కిలోమీటర్ల పొడవున పరదాలు కావాలని ఎద్దేవా చేశారు.
Also Read: WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై చాట్ మరింత భద్రం?