WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై చాట్ మరింత భద్రం?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు
- By Nakshatra Published Date - 07:30 PM, Wed - 16 August 23
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం లక్షలాది మంది వినియోగదారులు చాటింగ్ కోసం, వీడియో కాల్స్ ఇతర అవసరాల కోసం వాట్సాప్ ని ఉపయోగిస్తూనే ఉంటారు. అంతేకాకుండా రోజురోజుకీ స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్యతో పాటు వాట్సాప్ వినియోగదారుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. దీంతో వాట్సాప్ సంస్థ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వాట్సాప్ సంస్థ మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఆ వివరాల్లోకి వెళితే. వాట్సాప్ చాట్ భద్రత విషయంలో ఒక భయం అందిరిలోనూ ఉంది. అదే చాట్ లకు ప్రత్యేకమైన భద్రత లేకపోవడం. అందరూ దానిని చూసే వీలు ఉంటుంది. ఉదాహరణకు వాట్సాప్ డెస్క్ టాప్ వెర్షన్ తీసుకుంటే కోడ్ స్కాన్ చేయగానే చాట్ మొత్తం కనిపిస్తుంది. పొరపాటున దానిని లాగ్ అవుట్ చేయకపోతే చాట్ లు మొత్తం కనిపిస్తాయి. అందుకే ఇప్పుడు వాట్సాప్ సరికొత్త అప్ డేట్ డెస్క్ టాప్ వెర్షన్ల కోసం తీసుకొచ్చింది. అదే స్క్రీన్ లాక్ పీచర్. దీనిని ఎనేబుల్ చేసుకుంటే పాస్ వర్డ్ లేకుండా మీ చాట్లు ఓపెన్ కావు. తాజా ఫీచర్ తో కూడిన వెర్షన్ వారికి అలాగే అధికారిక బీటా ప్రోగ్రామ్లో భాగమైన బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.
ఇకపోతే ఈ ఫీచర్ ఎలా ఎనేబుల్ చేయాలి అన్న విషయానికి వస్తే.. వాట్సాప్ లో స్క్రీన్ లాక్ ఫీచర్ ఎనేబుల్ చేస్తే వీ చాట్లు అన్ని లాక్ అవుతాయి. మళ్లీ పాస్ వర్డ్ ఎంటర్ చేస్తేనే చాట్లు ఓపెన్ అవుతాయి. వినియోగదారులు ఇంకా దీనిని యాక్టివేట్ చేయకపోతే ముందు మీ వాట్సాప్ ని అప్ డేట్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ప్రైవసీని క్లిక్ చేయాలి. దానిలో స్క్రీన్ లాక్ పాయింట్ అనేది మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి, పాస్ వర్డ్ సెట్ చేసుకుంటే సరిపోతోంది. ఈ పాస్వర్డ్ ప్రాంప్ట్ ఎప్పుడు కనిపించాలో ఎంచుకోవడం ద్వారా వినియోగదారులు ఫీచర్ ని కాన్ఫిగర్ చేయవచ్చు. పాస్వర్డ్ మర్చిపోయినట్లయితే, వాట్సాప్ వెబ్ నుండి లాగ్ అవుట్ చేసి, క్యూఆర్ తో మళ్లీ స్కాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.