Nara Lokesh Slams Jagan: జగన్ నువ్వు మారవా? బరితెగించావు అంటూ నారా లోకేష్ ట్వీట్!
అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు చేస్తున్న లేనిపోని ఆరోపణలను ఆయన ఖండించారు.
- By Gopichand Published Date - 11:48 PM, Wed - 25 December 24

Nara Lokesh Slams Jagan: తిరుపతిలో మంగళవారం జరిగిన ఓ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. గుర్తుతెలియని వ్యక్తి తిరుపతిలో ఉన్న అన్నమయ్య విగ్రహానికి క్రిస్టియన్ శాంటాక్లాజ్ టోపీ పెట్టడంతో హిందూ సంఘాలు భగ్గుమన్నాయి. ఈ విషయమై ఏపీలోని హిందూ సంఘాలు, అన్నమయ్య భక్తులు విగ్రహం ముందు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా ఈ ఘటనపై మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh Slams Jagan) స్పందించారు.
అన్నమయ్య విగ్రహానికి శాంటాక్లాజ్ టోపీ పెట్టిన ఘటనపై మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ఈ విషయంపై వైసీపీ నాయకులు చేస్తున్న లేనిపోని ఆరోపణలను ఆయన ఖండించారు. వైసీపీ కావాలనే ఈ విషయాన్ని పెద్దదని చేస్తోందదని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, వైసీపీ అధినేత జగన్‌కు కౌంటర్ కూడా ఇచ్చారు.
Also Read: Rahul Gandhi: మంత్రి పొన్నం లేఖకు రాహుల్ గాంధీ ప్రతిస్పందన.. ఏమన్నారంటే?
.@ysjagan తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక.. ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది.. అయినా తిరుమల, తిరుపతి ప్రతిష్ట మంట కలపాలని ఫేక్… https://t.co/ojAa46gOI0 pic.twitter.com/cXbJjKCHFo
— Lokesh Nara (@naralokesh) December 25, 2024
జగన్‌కు కౌంటర్
తన ట్వీట్‌లో వైసీపీ అధినేత జగన్‌కు మంత్రి లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలదా? ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు.. శాంటా క్లాజ్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా తిరుమల, తిరుపతి ప్రతిష్ట మంట కలపాలని ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు’’ అని కౌంటర్ ఇచ్చారు.
టీటీడీ మాజీ చైర్మన్ ఫైర్
లోకేష్ కంటే ముందు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నమయ్య విగ్రహం ఘటనపై స్పందించారు. ‘‘తిరుపతిలో మరోసారి అపచారం. అన్నమయ్య విగ్రహానికి శాంతాక్లాజ్ టోపీ పెట్టారు. కూటమి పాలనలో బరితెగింపుకు ఇది నిదర్శనం చంద్రబాబు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. సనాతనధర్మ పరిరక్షణ అంటూ కబుర్లు చెప్పే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు దీనికి పూర్తి బాధ్యత వహించాలి’’ అని డిమాండ్ చేశారు.
అయితే ఈ ఘటనపై తాజాగా తిరుపతి పోలీసులు స్పందించారు. ఈ ఘటనకు ఒక బిచ్చగాడు పాల్పడినట్లు సీపీ ఫుటేజ్‌లో రికార్డైనట్లు వారు తెలిపారు. అంతేకాకుండా అతన్ని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.