HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Minior Boy Killed In Eluru Tribal Hostel

Minior Boy Killed : ఏలూరులో మైన‌ర్ బాలుడు దారుణ హ‌త్య‌.. పాఠ‌శాల ఆవ‌ర‌ణలోనే.. ?

ఏలూరులోని గిరిజ‌న హాస్ట‌ల్‌లో కిడ్నాప్ అయిన బాలుడు శ‌వ‌మై క‌నిపించాడు. ఏలూరు జిల్లా పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ

  • Author : Prasad Date : 12-07-2023 - 8:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Murder
Murder

ఏలూరులోని గిరిజ‌న హాస్ట‌ల్‌లో కిడ్నాప్ అయిన బాలుడు శ‌వ‌మై క‌నిపించాడు. ఏలూరు జిల్లా పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ హాస్టల్‌లో నాలుగో తరగతి చదువుతున్న మైనర్ బాలుడు పాఠ‌శాల ఆవ‌ర‌ణ‌లో శవమై కనిపించాడని. అయితే బాలుడి చేతిలో ఓ లేఖ ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతుంది. అతని చేతిలో ఇలాంటి హత్యలు మరిన్ని చేస్తామని బెదిరించే లేఖ లభించిందని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలుడిని హాస్టల్ నుంచి కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు తెలుగులో రాసిన లేఖలో.. బ్రతకాలనుకున్న వాళ్లు వెళ్లిపోండి ఎందుకంటే ఇక నుంచి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అని లేఖ‌లో రాసి ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. బాలుడు మృత‌దేహం మెడ చుట్టూ గాయాలు, కుడి కన్ను దగ్గర చిన్న గీతలు ఉన్నాయని ఏలూరు పోలీసు సూపరింటెండెంట్ డి మేరీ ప్రశాంతి తెలిపారు.

పులిరాముడుగూడెంలోని హాస్టల్ పక్కన ఉన్న పాఠశాల ఆవరణలో ఉదయం 5.30 గంటలకు బాలుడి మృతదేహం లభ్యమైందని తెలిపారు. పోలీసుల విచారణలో బాలుడు 10 మంది విద్యార్థులతో కలిసి వసతి గృహంలో యథావిధిగా నిద్రపోయాడని.. అర్ధరాత్రి సమయంలో మెష్ లేని కిటికీలోంచి ఎవరో హాల్లోకి ప్రవేశించారని, మరొక వ్యక్తి లోపలికి వెళ్లేందుకు తలుపు గొళ్ళెం తెరిచినట్లు ఒక అబ్బాయి గమనించాడని పోలీసులు తెలిపారు. ఈ ఇద్దరు దుండ‌గులు మైన‌ర్‌ బాలుడిని తీసుకువెళ్లారు, అయితే ఈ అపహరణను చూసిన విద్యార్థి భయపడ్డాడ‌ని.. ఈ సమాచారాన్ని ఎవరికీ వెల్లడించలేదని పోలీసులు తెలిపారు. ఉదయం పాఠశాలలో బాలుడు శవమై కనిపించాడని పోలీసులు తెల‌పారు. మరణించిన బాలుడి అన్నయ్య కూడా అదే పాఠశాలలో ఆరవ తరగతి చదువుతున్నాడని.. అదే హాస్టల్‌లో ఉంటాడ‌ని పోలీసులు తెలిపారు. అయితే బాలుడు కుటుంబ‌స‌భ్యులు మాత్రం అనుమానితుల పేర్లు వెల్ల‌డించ‌లేద‌ని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై బుట్టాయగూడెం పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • crime
  • eluru
  • minior boy killed
  • murder
  • Tribal welfare hostel

Related News

Physics Wala Vidyapeeth launched in Vijayawada

Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

విజయవాడలోని ఎంజీ రోడ్డులో సంస్థ తన మొట్టమొదటి టెక్-ఎనేబుల్డ్ PW విద్యాపీఠ్ కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సింగ్ రాథోడ్ ప్రారంభించారు.

  • Yashoda Hospital Fake Doctor

    సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్ కలకలం

  • FBI raises reward to $1 million

    FBI : యూఎస్ బంపర్ ఆఫర్.. ఇతడిని పట్టిస్తే రూ. 9.18 కోట్లు రివార్డు మీవే..

Latest News

  • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

  • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

  • YCP : వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ..పార్టీ లో కొత్త జోష్ మొదలు కాబోతుందా ?

  • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

  • Donald Trump : ట్రంప్‌కు కోలుకోలేని దెబ్బ కొట్టిన మిత్రదేశాలు

Trending News

    • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

    • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

    • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    • ఇకపై వీరికి ఎల్‌పిజి సిలిండర్లు లభించవు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd