Kuppam: కుప్పం.. ఇక దేశానికే రోల్‌మోడల్!
కేవలం పారిశ్రామిక రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లోనూ కుప్పం వేగంగా అభివృద్ధి చెందుతోంది. బెంగళూరు, చెన్నై లాంటి రాజధానులకు సమీపంలో ఉండడం కుప్పంకు కలిసివచ్చే అంశం.
- By Gopichand Published Date - 02:35 PM, Wed - 3 September 25

Kuppam: సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కుప్పం (Kuppam) నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో అనేక కంపెనీలు కుప్పం నియోజకవర్గంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. గతంలో కుప్పం వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు పారిశ్రామిక, సామాజిక అభివృద్ధికి కేంద్రంగా మారుతోంది. ఈ మార్పు వెనుక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రణాళికలు, చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
కుప్పంను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రభుత్వ అధికారులతో కలిసి పలు దేశీయ, అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా కుప్పంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి కొన్ని ప్రముఖ కంపెనీలు అంగీకరించాయి.
కుప్పంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు ఇవే
కింగ్స్ ఉడ్ డెకర్- ఈ కంపెనీ దాదాపు 1100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా MDF బోర్డు యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ పెట్టుబడితో దాదాపు 2 వేల 12 మందికి నేరుగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
పయోనీర్ క్లీన్ యాంప్స్- ఈ సంస్థ 150 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సంస్థ ఎయిర్‌క్రాఫ్ట్ మాన్యుఫ్యాక్చరీంగ్, ట్రైనింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. దీంతో 250 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. ఈ యూనిట్ స్థాపనతో, కుప్పంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం బలోపేతం అవుతుంది
రాకెట్ తయారీలో ప్రత్యేకత కలిగిన బెంగుళూరుకు చెందిన ఎథేరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ కంపెనీ కుప్పంలో రూ. 500 కోట్ల పెట్టుబడితో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనిట్ ద్వారా రాకెట్ తయారీతో పాటు, అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన ఇతర పనులు కూడా జరుగుతాయి. ఈ భారీ పెట్టుబడి ద్వారా కుప్పంలో దాదాపు 500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో నిపుణులైన యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ ప్రాజెక్ట్ వల్ల కుప్పం పారిశ్రామికంగానే కాకుండా, అంతరిక్ష పరిశోధనా కేంద్రంగా కూడా గుర్తింపు పొందుతుంది.
Also Read: GST Council : సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్: తగ్గనున్న 175 వస్తువుల ధరలు
రెడ్ బెర్రి వుడ్- ఈ సంస్థ రూ. 300 కోట్ల పెట్టుబడితో కుప్పంలో ఒక అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా.
కేవలం పారిశ్రామిక రంగంలోనే కాకుండా విద్య, వైద్యం, మౌలిక వసతుల రంగాల్లోనూ కుప్పం వేగంగా అభివృద్ధి చెందుతోంది. బెంగళూరు, చెన్నై లాంటి రాజధానులకు సమీపంలో ఉండడం కుప్పంకు కలిసివచ్చే అంశం. హైటెక్ సిటీ, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, అధునాతన ఆసుపత్రులు వంటి ప్రాజెక్టులు ఇక్కడ వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి. కుప్పంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టులన్నీ కుప్పంను ఒక స్మార్ట్ సిటీగా, అత్యాధునిక పట్టణంగా తీర్చిదిద్దడంలో సహాయపడతాయి. పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనతో కుప్పం యువతకు మెరుగైన భవిష్యత్తును అందిస్తుంది. కొత్తగా వస్తున్న కంపెనీల ద్వారా కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా, నైపుణ్యాభివృద్ధికి కూడా అవకాశాలు లభిస్తాయి. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వంటి రంగాలలో పెట్టుబడుల వల్ల యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందుతుంది. దీంతో కుప్పం దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా మారే అవకాశం ఉంది.