HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Konapapapeta Village In Andhra Pradesh Is Sinking Into The Sea

Konapapapeta : సముద్రంలో మునిగిపోతున్న కోనపాపపేట.. ఇప్పటికే వందలాది ఇళ్లు మాయం

గత రెండేళ్ల వ్యవధిలో ఈ ఊరి(Konapapapeta)లోని భూభాగం దాదాపు 50 మీటర్ల మేర సముద్రంలో కలిసిపోయింది.

  • Author : Pasha Date : 19-12-2024 - 7:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Konapapapeta Sinking Ap Andhra Pradesh Village Sinking Into Sea

Konapapapeta : ఆంధ్రప్రదేశ్‌లోని ఆ ఊరు క్రమంగా సముద్రంలో మునిగిపోతోంది. ఇప్పటికే వందలాది ఇళ్లు సముద్రంలో మునిగాయి. ఫలితంగా వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఆ ఊరి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :Who is Phangnon Konyak : రాహుల్‌గాంధీ వల్ల అసౌకర్యానికి గురయ్యానన్న ఫాంగ్నాన్ కొన్యాక్.. ఎవరు ?

  • కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని కోనపాపపేట గ్రామం జనాభా దాదాపు 4వేలు.
  • ఈ ఊరిలోని భూభాగం ఏటా సముద్ర జలాల ఆటుపోట్ల వల్ల తీవ్ర కోతకు గురవుతోంది.
  •  గత రెండేళ్ల వ్యవధిలో ఈ ఊరి(Konapapapeta)లోని భూభాగం దాదాపు 50 మీటర్ల మేర సముద్రంలో కలిసిపోయింది. అంటే అంతమేర సముద్రం ముందుకు కదిలి వచ్చింది.
  • ఊరిలోని భూభాగం సముద్రంలో కలిసిపోతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
  • గత రెండు నెలల్లో పలు తుఫానుల వల్ల కోనపాపపేట గ్రామంలోని కొంత తీర ప్రాంతం సముద్రంలో మునిగింది. చెట్లు కూలాయి. విద్యుత్‌ స్తంభాలు పడిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి.
  • తాజాగా మంగళవారం రాత్రి సముద్రంలో కెరటాలు భీకర స్థాయిలో  ఎగిసిపడటంతో ఆ గాలుల ధాటికి తీరంలోని పలు ఇళ్లు నేలమట్టం అయ్యాయి.
  • ఈ ఊరిలోని మెయిన్ రోడ్డు నుంచి సముద్ర తీరం వరకు దాదాపు 200 మీటర్ల పరిధిలో ఆరు వరుసల్లో మత్స్యకారుల ఇళ్లు ఉండేవి. ఆ ఇళ్లలో దాదాపు 600 మంది నివసించేవారు.
  • సముద్ర కోత వల్ల  నాలుగు వరుసలలోని దాదాపు 100 ఇళ్లు మాయమయ్యాయి. దాదాపు 400 మంది నిలువనీడ కోల్పోయారు.
  • ప్రస్తుతం కోనపాపపేటలో రెండు వరుసల్లో 50 ఇళ్లే మిగిలాయి. వాటిలోని కుటుంబాల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారింది.
  • సముద్రపు జలాల కోత నుంచి  కోనపాపపేటను రక్షించేందుకుగానూ  వాకలపూడి నుంచి అమీనాబాదు వరకు రక్షణ గోడను నిర్మిస్తామని టీడీపీ సర్కారు చెబుతోంది. ఆ పనులను సాధ్యమైనంత త్వరగా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. తమ కుటుంబాలు నిలువ నీడ కోల్పోకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నారు.

Also Read :Dharam Sansad : ‘ధర్మ సంసద్‌’ను ఆపలేం.. విద్వేష ప్రసంగాలను మానిటరింగ్ చేయండి : సుప్రీంకోర్టు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • Konapapapeta
  • Konapapapeta Sinking
  • Village Sinking Into Sea

Related News

Apsrtc Samme

వెనక్కు తగ్గిన ఏపీఎస్ ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు, సమ్మె విరమణ తో ఊపిరి పీల్చుకున్న ప్రజలు

ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నెల 12 నుంచి సమ్మె తలపెట్టగా ప్రభుత్వ జోక్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘాల నాయకులు వెల్లడించారు. 5 ప్రధాన సమస్యలను ఆర్టీసీ ఎండీకి వివరించినట్లు

  • Ntr Statue Amaravati

    అమరావతిలో 3500 టన్నుల కంచుతో NTR భారీ విగ్రహం

  • Sankranthi Toll Gate

    సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వాహనదారులకు బ్యాడ్ న్యూస్ !

  • Magnum Wings Air Taxi

    వావ్ ఎయిర్ ట్యాక్సీలు వచ్చేస్తున్నాయోచ్ !!

  • Amaravati

    అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం

Latest News

  • రోజూ అవిసె గింజల పొడి తింటే కలిగే లాభాలివే..!

  • కుబేర యోగం అంటే ఏమిటి?..జాతకంలో యోగం లేకపోతే చేయాల్సింది ఏమిటి?

  • ఈ నెల 28 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

  • కూలే క్యాన్సర్ అంటే ఏమిటి? ప్ర‌ధాన ల‌క్ష‌ణాలివే!

  • ఏపీలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా టికెట్ రేట్ల పెంపు

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd