Jagan Social Media: జగన్ చూపు సోషల్ మీడియా వైపు.. కారణమిదేనా..?
అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు గనుక చూసుకుంటే.. ఏపీలో నాయకులు చేసే మంచి పనులు లేదా అభివృద్ధి కార్యక్రమాలు టీవీ ఛానెల్‌లో కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమవుతున్నాయి.
- By Gopichand Published Date - 03:11 PM, Fri - 18 October 24

Jagan Social Media: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నయా ప్లాన్‌తో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు పార్టీ కార్యకర్తలు, ముఖ్య నేతలతో సమావేశమైన జగన్ ఇప్పుడు సోషల్ మీడియా (Jagan Social Media)లో ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా ఉండాలంటూ బాంబ్ పేల్చారు. అలాంటివారికే పార్టీ ఇకపై పదోన్నతులు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. అయితే జగన్ ఉన్నట్లు ఉండి సోషల్ మీడియా వైపు ఎందుకు వెళ్లారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న..?
అయితే ఏపీలోని రాజకీయ పరిస్థితులు గనుక చూసుకుంటే.. ఏపీలో నాయకులు చేసే మంచి పనులు లేదా అభివృద్ధి కార్యక్రమాలు టీవీ ఛానెల్‌లో కంటే ముందుగా సోషల్ మీడియాలోనే ప్రత్యక్షమవుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా ఎక్స్ (గతంలో ట్విట్టర్)లోనే నాయకుల మీద మీమ్స్, ట్రోల్స్ మనకు కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం చేసిన ప్రతి చిన్న పనిని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దానిని అందరికీ చేరేలా చర్యలు తీసుకోవటంలో సక్సెస్ అవుతోంది. అయితే గతంలో అధికారంలో ఉన్న వైసీపీ చేసిన మంచిన చెప్పుకోలేకనే ఓడిపోయిందని వైఎస్ జగన్ బాగా నమ్ముతున్నట్లు వైసీపీ వర్గాలు తెలుపుతున్నాయి.
Also Read: Maharashtra Assembly Election 2024: మహారాష్ట్ర ఎన్నికల సమరం.. నేడు బీజేపీ మొదటి జాబితా..?
అయితే ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా నియమకాలు చేపట్టిన వైసీపీ తమకు అనుకూలంగా ఉన్న మీడియా, వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లతో భారీ డీలింగ్స్ ఒప్పందాలు చేసుకున్నట్లు కూడా వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు అలాగే కూటమి ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకొచ్చేందుకు జగన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఇటీవల ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి, వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోవటానికి కారణం సోషల్ మీడియాలో బలం లేకపోవటమే కారణమని ఇటీవల జగన్ ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పలు వెబ్ సైట్లు, యూట్యూబ్‌ల ద్వారా ఒప్పందాలు చేసుకున్న వైసీపీ.. తాజాగా కార్యకర్తలను సైతం సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యేందుకు చర్యలు చేపట్టింది. సోషల్ మీడియా ద్వారానే వచ్చే ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది. మరీ జగన్ చేస్తున్న సోషల్ మీడియా ప్రణాళికలు ఆయనను ఎంతవరకు అధికారంలోకి తీసుకువస్తాయో చూడాలి. ఇప్పటికే జమిలి ఎన్నికలకు ఓటేసిన జగన్ త్వరలో జనంలోని రానున్నట్లు తెలుస్తోంది.