Maharashtra Assembly Election 2024: మహారాష్ట్ర ఎన్నికల సమరం.. నేడు బీజేపీ మొదటి జాబితా..?
బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో 110 మంది అభ్యర్థుల పేర్లు ఆమోదించబడ్డాయి. ఈ క్రమంలో 50 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
- By Gopichand Published Date - 02:25 PM, Fri - 18 October 24

Maharashtra Assembly Election 2024: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Election 2024)కు 1 నెల కంటే తక్కువ సమయం ఉంది. రాష్ట్రంలోని రెండు పెద్ద వర్గాలు, మహాయుతి, మహావికాస్ అఘాడి (MVA) ముఖాముఖిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మహారాష్ట్రలోని 288 స్థానాలకు అభ్యర్థుల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. నివేదికలను విశ్వసిస్తే.. బీజేపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థుల మొదటి జాబితాను నేడు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ జాబితాలో 50 మంది అభ్యర్థుల పేర్లు చేర్చినట్లు సమాచారం. అయితే MVA మొదటి జాబితాకు సంబంధించి ఇంకా ఎటువంటి అప్‌డేట్ రాలేదు.
మహాయుతి మొదటి జాబితా
మీడియా కథనాల ప్రకారం.. బుధవారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించింది. ఇందులో 110 మంది అభ్యర్థుల పేర్లు ఆమోదించబడ్డాయి. ఈ క్రమంలో 50 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను నేడు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాను ఢిల్లీ నుంచి విడుదల చేయనున్నారు. ఇందులో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లు ఉంటాయి. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా మంది మంత్రుల టిక్కెట్లు కూడా కోత పడే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: IND vs NZ 1st Test: టీమిండియాతో టెస్టు.. న్యూజిలాండ్ 402 పరుగులకు ఆలౌట్
మహాయుతి సీట్ల పంపకం గురించి మాట్లాడుకుంటే.. మహారాష్ట్రలోని 288 సీట్లలో 150 సీట్లపై బీజేపీ తన వాదనను వినిపించింది. మిగిలిన 138 సీట్లు షిండే, అజిత్ పవార్ పార్టీకి దక్కనున్నాయి. ఈ ఎన్నికల్లో ఏక్‌నాథ్ షిండే మరోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే అవకాశం ఉంది. అయితే దీనిపై మహాయుతి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
MVA ప్లాన్
మహావికాస్ అఘాడి (MVA)లో సీట్ల పంపిణీకి సంబంధించి కొన్ని చోట్ల సమస్య ఉంది. అయితే నివేదికలు నమ్మితే 288 అసెంబ్లీ సీట్లలో 200 సీట్లపై ఒప్పందం కుదిరింది. MVA కూటమిలో కాంగ్రెస్, శివసేన (UBT), SP ఉన్నాయి. ఎంవీఏలో సీట్ల పంపకంపై పాటిల్ నిర్ణయం తీసుకుంటారని ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్ చెప్పారు. అక్టోబర్ 20న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో అభ్యర్థుల తుది జాబితా సిద్ధమయ్యే అవకాశం ఉంది.