Jagan Assembly Membership: వైఎస్ జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు కాబోతుందా?
ఏపీలో వైసీపీ తప్ప కూటమికి మిగిలిన ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా లేదని అన్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్పకుండా సభకు వెళ్తానని హామీ ఇచ్చారు.
- By Gopichand Published Date - 03:08 PM, Wed - 20 November 24

Jagan Assembly Mmembership: ఏపీలో ప్రస్తుతం అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. గత ప్రభుత్వంలో అసలు ఎటువంటి అభివృద్ధి జరగలేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ తరపున గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ఎవరూ సభలకు హాజరుకావడం లేదు. ఇదే విషయమై జగన్‌ను (Jagan Assembly Mmembership) ఇటీవల ఓ రిపోర్టర్ మీరు అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు వెళ్లటం లేదని ప్రశ్నించారు. ఆ సయమంలో జగన్ చెప్పిన విషయం ఆసక్తికరంగా అనిపించింది.
ఏపీలో కేవలం అధికారంలో ఉన్న కూటమి పార్టీలు, వైసీపీ పార్టీలు మాత్రేమే ఉన్నాయన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయన్నారు. ఇంకా ఆ తర్వాత వైసీపీలో 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఏపీలో వైసీపీ తప్ప కూటమికి మిగిలిన ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీగా లేదని అన్నారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చి, తనకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్పకుండా సభకు వెళ్తానని హామీ ఇచ్చారు. ఈలోపు కూటమి ప్రభుత్వం తెలివిగా ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజును డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంది. అయితే డిప్యూటీ స్పీకర్‌గా రఘురామను ఎన్నుకుంటే జగన్‌ను అసెంబ్లీ సమావేశాలకు రాకుండా అడ్డుకోవచ్చని కూటమి సర్కార్ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ విషయాలన్నీ పక్కన పెడితే తాజాగా జగన్ అసెంబ్లీ సభ్యత్వం రద్దు కానున్నట్లు కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read: Gold Price : ‘కస్టమ్స్’ తగ్గాయి.. అందుకే బంగారం ధరకు రెక్కలు!
ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారిన విషయం మాజీ సీఎం జగన్ సభలకు గైర్హాజరు అవుతుండడమే. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 సభ్యులు, సభలకు రావాల్సిన విధానాలను స్పష్టం చేసింది. వరుసగా ఎవరైనా సభ్యుడు కనుక 60 రోజుల పాటు సభలకు హాజరు కాకపోతే.. సదరు సభ్యుడి సభ్యత్వం (ఎమ్మెల్యే) ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని ఈ ఆర్టికల్ కుండబద్దలు కొడుతోంది. జగన్ కనుక 60 రోజుల పాటు సభలకు వెళ్లకపోతే ఆయన సభ్యత్వం కూడా రద్దయ్యే అవకాశాలున్నాయి. మరీ జగన్ ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుంటే నిజంగానే సభ్యత్వం రద్దవుతుందా లేదా అనేది చూడాలి.