Gold Price : ‘కస్టమ్స్’ తగ్గాయి.. అందుకే బంగారం ధరకు రెక్కలు!
బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని(Gold Price) కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 6 శాతానికి తగ్గించింది.
- By Pasha Published Date - 02:56 PM, Wed - 20 November 24

Gold Price : బంగారం రేటు దిగొచ్చే పరిస్థితే కనిపించడం లేదు. పెళ్లిళ్ల సీజన్ మొదలు కావడంతో గోల్డ్ రేట్లు మళ్లీ పెరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 70,650కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 77,070కు చేరింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ -గాజా యుద్ధం వల్ల కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. భారత సహా చాలా ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు ప్రస్తుతం తమ గోల్డ్ రిజర్వులను పెంచుకుంటున్నాయి. తద్వారా తమ కరెన్సీల విలువ పతనం కాకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. దీనివల్ల బులియన్ మార్కెట్లలో బంగారం లభ్యత తగ్గుతోంది. ఫలితంగా ధరలు పెరుగుతూపోతున్నాయి.
Also Read :AP Woman : ‘‘యజమాని చంపేసేలా ఉన్నాడు కాపాడండి..’’ కువైట్ నుంచి ఏపీ మహిళ సెల్ఫీ వీడియో
బంగారం, వెండి దిగుమతులపై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ డ్యూటీని(Gold Price) కేంద్ర ప్రభుత్వం ఇటీవలే 6 శాతానికి తగ్గించింది. అప్పటి నుంచి బంగారు ఆభరణాలను రిటైల్‌గా విక్రయించే రిలయన్స్ రిటైల్, టైటాన్, ఖజానా జువెల్లర్స్, మలబార్ గోల్డ్, జోయ్ అలూకాస్, కళ్యాన్ జువెల్లర్స్ వంటి కంపెనీల నుంచి గోల్డ్ దిగుమతి కోసం ఆర్డర్లు పెరిగాయి. ఒక్కసారిగా ఈవిధంగా గోల్డ్‌కు డిమాండ్ పెరగడం అనేది ధరల పెరుగుదలకు దారితీసిందని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. గోల్డ్ రిటైలింగ్ కంపెనీలు ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ మధ్యకాలంలో విదేశాల నుంచి మన దేశానికి 248.3 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నాయి. ఈ ఏడాది (2024) చివరికల్లా విదేశాల నుంచి మనదేశానికి దిగుమతి చేసుకున్న గోల్డ్ దాదాపు 750 టన్నుల మేర ఉంటుందని ఒక అంచనా. ఇందులో దాదాపు మూడో వంతు బంగారాన్ని కేవలం జులై నుంచి సెప్టెంబరు మధ్యకాలంలోనే దిగుమతి చేసుకోవడం గమనార్హం.
Also Read :Harsh Goenka : సెలబ్రిటీల ఓటింగ్‌పై హర్ష్ గోయెంకా ఫైర్.. డైలమాలో ఉన్నారంటూ ఎద్దేవా
మనదేశానికి దిగుమతి అయి గోల్డ్‌లో దాదాపు 40 శాతం స్విట్జర్లాండ్ నుంచే వచ్చింది. యూఏఈ నుంచి 16 శాతం, దక్షిణాఫ్రికా నుంచి 10 శాతం బంగారం దిగుమతి అయింది. దేశ మొత్తం దిగుమతుల్లో బంగారం దిగుమతుల వాటా 5 శాతం. బంగారానికి చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద వినియోగదారు దేశం భారతే.