HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Indsol Company Sending Threatening Letters To Ap Government

Indsol Company : కూటమి ప్రభుత్వానికి బెదిరింపు లేఖ

Indsol Company : ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ (Indsol Company) ప్రభుత్వానికి లేఖ (Threatening letter) రాస్తూ, తమకు కేటాయించిన భూములను మార్చకుండా అందించాలంటూ హెచ్చరికలు

  • Author : Sudheer Date : 16-02-2025 - 8:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Indsol Company Sending Thre
Indsol Company Sending Thre

గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దౌర్జన్యంగా భూములు కేటాయించుకున్న సంస్థలు ఇప్పటికీ పద్ధతి మార్చుకోకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి బెదిరింపులకు దిగుతున్నాయి. అందులో ప్రధానంగా ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ (Indsol Company) ప్రభుత్వానికి లేఖ (Threatening letter) రాస్తూ, తమకు కేటాయించిన భూములను మార్చకుండా అందించాలంటూ హెచ్చరికలు చేసింది. ఈ సంస్థ వైసీపీ హయాంలో ఏ ప్రణాళిక లేకుండానే భారీ ఎకరాల భూములను దక్కించుకుంది. ఇప్పుడు ప్రభుత్వం పోర్టు అభివృద్ధికి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ భూములు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా, సంస్థ దాన్ని అంగీకరించకుండా కేంద్రానికి ఫిర్యాదు చేస్తామంటూ బెదిరిస్తోంది.

Vishwambhara : విశ్వంభర లో మరో మెగా హీరో..?

గత ప్రభుత్వంలో ఇండోసోల్‌కు బహిరంగంగా కేటాయింపులు జరిగాయి. 2023లో రామాయపట్నం పోర్టు సమీపంలో సోలార్ ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారీ పేరుతో 8,348 ఎకరాల భూమిని రెండు విడతల్లో అందుకున్నారు. దీనికి సంబంధించి ఏ ప్రాజెక్టు ప్రణాళిక (DPR) సమర్పించకుండానే అడ్డదారిలో ఈ భూములను పొందారు. ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఈ అక్రమాలు బహిరంగం అవుతాయనే భయంతో జనవరిలోనే హడావిడిగా షెడ్లు నిర్మించి, నెల రోజుల్లో ఉత్పత్తి ప్రారంభించినట్లు ప్రకటించింది. పోర్టుకు అడ్డంకిగా ఇండోసోల్ భూములు నిలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా కారేడు వద్ద భూములను కేటాయించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇండోసోల్ తమ ప్రాజెక్టును వెనక్కి తీసుకుంటామని, రీలోకేషన్ వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని, న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వ్యవహారాన్ని మీడియా, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తామంటూ బెదిరింపులకు దిగింది.

Nara Lokesh Warning : తప్పు చేసిన ఏ వైసీపీ నేతను వదిలిపెట్టను – మంత్రి లోకేష్

ప్రభుత్వ వర్గాల ప్రకారం.. ఇండోసోల్‌కు కేటాయించిన భూముల్లో ఒక్క ఎకరాన్ని కూడా తగ్గించలేదు. పైగా ఫోటో వోల్టాయిక్ సెల్స్ తయారీలో ఉపయోగించే ముడి సరుకైన క్వార్ట్జ్ గనులను కూడా ఈ సంస్థకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాలు కూడా యధాతథంగా కొనసాగించనుంది. అయినప్పటికీ ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్ బెదిరింపులకు దిగడం, ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ వ్యవహారం కూటమి ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు పోర్టు అభివృద్ధికి ఆటంకాలు లేకుండా భూవినియోగాన్ని సవరించాల్సిన అవసరం, మరోవైపు గత ప్రభుత్వంలో అక్రమంగా భూసేకరణ చేసుకున్న సంస్థల ఆగడాలను అరికట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇండోసోల్ వ్యవహారంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • AP government
  • Indsol Company
  • indsol company sending threatening letter

Related News

Health Minister

AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

రాష్ట్రంలోని ఐదు బోధనాసుపత్రుల్లో తొలిసారిగా కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు రాబోతున్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. దివ్యాంగులకు అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు, వీల్ ఛైర్లు, వినికిడి పరికరాలు, ఇతర సహాయ ఉపకరణాల తయారీ ఈ కేంద్రాల్లో జరుగుతాయని పేర్కొన్నారు. వైద్యులు సూచించే అవసరమైన కృత్రిమ కాళ్లు, చేతులు ఇవ్వడంవల్ల దివ్యాంగుల

  • Good news from the government for those waiting for pensions.

    Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd