HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Life Style
  • >If Men Also Want Glowing Skin This Is Exactly What They Need To Do

Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

  • Author : Vamsi Chowdary Korata Date : 23-06-2026 - 1:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
If men also want glowing skin, this is exactly what they need to do!
If men also want glowing skin, this is exactly what they need to do!

ఈ రోజుల్లో కేవలం స్త్రీలు మాత్రమే కాకుండా పురుషులు కూడా అందంగా కనిపించడం కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ మరియు హోమ్ రెమెడీస్‌ని ఫాలో అవుతూ ఉంటారు. అందం విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తున్నారు. అయితే పురుషులు కూడా అందంగా కనిపించాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటించడం తప్పనిసరి. మగవారు చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పురుషులు షేవ్ చేసుకున్న తర్వాత ఇరిటేషన్, దురదలు కలగడం, డార్క్ స్పాట్స్, యాక్నీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కనుక పురుషులు కూడా తమ చర్మంపై శ్రద్ధ తీసుకోవాలి.

డ్రై స్కిన్ అయినా, ఆయిల్ స్కిన్ అయినా లేదా కాంబినేషన్ స్కిన్ అయినా కచ్చితంగా వాళ్లకి తగ్గ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉండాలి. డైలీ స్కిన్ కేర్ రొటీన్‌ని ఫాలో అవ్వాలి. దీనివల్ల మరింత అందంగా మారడానికి అవకాశం ఉంది. అయితే పురుషులు వారి యొక్క స్కిన్ టోన్‌కి తగ్గట్టుగా స్కిన్ కేర్‌ని పాటిస్తూ ఉండాలి. క్లియర్ మరియు ఆరోగ్యకరమైన చర్మం కోసం డెర్మటాలజిస్ట్ చెప్పిన ఈ చిట్కాలను పాటిస్తే మంచిది. మగవారు వాళ్ళ చర్మానికి ఎలా శ్రద్ధ తీసుకోవాలి అంటే, ప్రతిరోజూ ముఖాన్ని రెండు సార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి వంటివి తొలగిపోతాయి. అదే విధంగా చర్మంపై ఉండే డెడ్ స్కిన్, ఆయిల్ వంటివి కూడా తొలగిపోతాయి. దీనితో చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి.

అలాగే చర్మం బ్రైట్‌గా, అందంగా కనబడుతుంది. మహిళలకు ఎలా అయితే ఎక్స్‌ఫోలియేషన్ అవసరమో, పురుషులు కూడా ఎక్స్‌ఫోలియేషన్‌కి ప్రాముఖ్యత ఇవ్వాలి. కనీసం వారానికి రెండు నుండి మూడు సార్లు ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం క్లియర్‌గా, మృదువుగా ఉంటుంది. ఇలా చేయడం వలన డెడ్ స్కిన్ కూడా తొలగిపోతుంది. మీరు ఎక్స్‌ఫోలియేషన్ చేసేటప్పుడు గట్టిగా ఉండే స్క్రబ్స్, బ్రష్‌లు వంటివి ఉపయోగించవద్దు. వీటిని ఉపయోగిస్తే దురద, ఇరిటేషన్ లాంటి సమస్యలు వస్తాయి. అలాగే ఎక్కువ సూర్యకిరణాల వల్ల కూడా చర్మానికి హాని కలుగుతుంది. అటువంటి సమయంలో మీరు చర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండటం ముఖ్యం. ఎప్పుడూ కూడా మీరు SPF 30 కంటే ఎక్కువ ఉండే దానిని ఉపయోగించండి.

దీని వల్ల స్కిన్ క్యాన్సర్ వంటి సమస్యలు కూడా రావు. అలాగే మీ చర్మం కూడా బాగుంటుంది. మంచి స్కిన్ కేర్ రొటీన్‌ని పాటించడం కూడా చాలా ముఖ్యం. విటమిన్ సి లేదా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ప్రొడక్ట్స్‌ని ఉపయోగించండి. రెగ్యులర్‌గా సన్ స్క్రీన్‌ని ఉపయోగించండి, దీనితో మీ చర్మం బాగుంటుంది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యంపై కూడా మీరు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం సరిగా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో మంచి పోషక పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోండి. మీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ని సరిగ్గా కంట్రోల్‌లో ఉంచే ఆహార పదార్థాలను తీసుకోండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • men beauty tips
  • Men Skincare
  • Mens Skincare routine
  • Mens Skincare tips
  • Monsoon Skincare
  • Skincare
  • Skincare Products
  • Skincare Remedies
  • skincare tips

Related News

    Latest News

    • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

    • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

    • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

    • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

    • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd