HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sai Dharam Tej Guest Role In Vishwambhara

Vishwambhara : విశ్వంభర లో మరో మెగా హీరో..?

Vishwambhara : ఈ మూవీ లో చిరంజీవి మేనల్లుడు సాయిదుర్గా తేజ్ (Sai Dharam Tej) గెస్ట్​ రోల్​లో నటిస్తున్నట్లు​ ప్రచారం జరుగుతుంది

  • By Sudheer Published Date - 07:54 AM, Sun - 16 February 25
  • daily-hunt
Saitej Chiranjeevi
Saitej Chiranjeevi

చిరంజీవి (Chiranjeevi) హీరోగా మల్లిడి వశిష్ఠ (Mallidi Vassishta) కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిరు 156 మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). సోషియో ఫాంటసీ మూవీ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్​లో శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా తాలూకా ఓ అప్డేట్ మెగా అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది.

Delhi Railway Station Stampede : ఢిల్లీ తొక్కిసలాటకు ఆ పుకారే కారణమా..?

ఈ మూవీ లో చిరంజీవి మేనల్లుడు సాయిదుర్గా తేజ్ (Sai Dharam Tej) గెస్ట్​ రోల్​లో నటిస్తున్నట్లు​ ప్రచారం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆన్‌స్క్రీన్‌లోనూ హీరో (చిరంజీవి) మేనల్లుడి పాత్రలో సాయి కనిపించనున్నారని సమాచారం. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్​కు డబుల్ ట్రీట్ అన్నట్లే. కాగా దుర్గా తేజ్ ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో ‘బ్రో’ (BRO) సినిమాలో ఫుల్​ లెంగ్త్​లో నటించారు. తేజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. ఆయనతో నటించే అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ‘చిరంజీవి సినిమాలో నటించే అవకాశం వస్తే తప్పకుండా యాక్ట్‌ చేస్తా. ఆ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. ఇక ఇప్పుడు విశ్వంభర తో తన కోరిక నెరవేరబోతుందని అభిమానులు భావిస్తున్నారు.

కాగా, ఈ సినిమాలో సీనియర్ నటి త్రిష హీరోయిన్​గా నటిస్తున్నారు. ఆషికా రంగనాథ్‌, మృణాల్ ఠాకూర్, కునాల్‌ కపూర్‌, జాన్వీ కపూర్ కీలక పాత్రలు పోషించనున్నారు. డైరెక్టర్ విశిష్ఠ ఈ సినిమాను సోషియో ఫాంటసీ జానర్​లో తెరకెక్కిస్తున్నారు. దీని కోసం ఆధునిక టెక్నాలజీ వాడుతున్నారు. వీఎఫ్స్​, సీజీ వర్క్స్ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ .200 కోట్ల భారీ బడ్జెట్​తో యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై విక్రమ్, వంశీ, ప్రమోద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2025 సంక్రాంతికే సినిమా విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chiranjeevi
  • sai dharam tej Guest Role
  • Vishwambhara

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd