HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >India Has A Missile Called Modi He Cant Even Pluck A Blade Of Grass On Indian Soil Lokesh

Minister Lokesh : భారత్‌ వద్ద మోడీ అనే మిసైల్‌ ఉంది..భారత్‌ గడ్డపై గడ్డి కూడా పీకలేరు: లోకేశ్‌

నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌ దిమ్మ తిరగడం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు.

  • Author : Latha Suma Date : 02-05-2025 - 4:46 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
India has a missile called Modi..he can't even pluck a blade of grass on Indian soil: Lokesh
India has a missile called Modi..he can't even pluck a blade of grass on Indian soil: Lokesh

Minister Lokesh : అమరావతి పునఃనిర్మాణ సభలో అమరావతి నమో నమః అని రెండు సార్లు అంటూ తన ప్రసంగాన్ని ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ప్రారంభించారు. ఒక్క పాకిస్థాన్‌ కాదు.. వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీ చేయలేరని మంత్రి నారా లోకేశ్ అన్నారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్థాన్‌ దిమ్మ తిరగడం ఖాయం. భారత గడ్డపై గడ్డి మొక్క కూడా పీకలేరు. మోడీకి ఏపీ అంటే ప్రత్యేక అభిమానం. ఏపీ ప్రాజెక్ట్‌లకు ఆమోదం చెబుతూ మద్దతు ఇస్తున్నారు. అందుకే ఇంత బిజీ షెడ్యూల్‌లో కూడా ఆయన రాష్ట్రానికి వచ్చారు. కావాల్సినన్ని నిధులు కేటాయిస్తున్నారు. పాక్‌పై చర్యలు ఎలాంటివి అయినా దేశం ఆయనకు మద్దతుగా ఉంటుందన్నారు లోకేష్. నమో ప్రారంభించిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికి లేదు. ఇక అమరావతి అన్‌స్టాపబుల్. ఇకపై అన్ని కార్యక్రమాలు జెట్ స్పీడ్‌తో సాగుతాయి అన్నారు.

Read Also: Amaravati Relaunch : అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది – పవన్‌

2014లో మనల్ని మెడపట్టి గెంటేశారు. రాజధాని కూడా లేకుండానే విడిపోయాం. చంద్రబాబు ఆత్మస్థైర్యం కోల్పోకుండా రాష్ట్రాన్ని నిలబెట్టారు. చంద్రబాబుపై కోపంతో కొందరు రాజధానిని పక్కనబెట్టారు. అమరావతికి అండగా ఆంధ్రా ప్రజలంతా నిలబడ్డారు అన్నారు. గత ప్రభుత్వం దొంగ కేసులు పెట్టి ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాలను మాత్రం ఆపలేకపోయింది. ఆపేదానికి.. పీకేదానికి అమరావతి ఎవరి ఇంట్లోనో పెంచుకున్న మొక్క కాదు.. జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని లోకేశ్‌ అన్నారు. ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా అమరావతి రైతులు తగ్గేదే లే అన్నారు.

మరోవైపు ప్రధాని మోడీ హాజరైన అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ముఖ్య నేతలందరూ సభా వేదికపై ఆశీనులై ఉండగా… ప్రధాని మోడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను దగ్గరకు పిలిచారు. ప్రధాని ఎందుకు పిలిచారోనని పవన్ హడావిడిగా వచ్చారు. అప్పుడు ప్రధాని మోడీ తన వద్ద ఉన్న చాక్లెట్ ను పవన్ కు ఇవ్వడంతో వేదికపై నవ్వులు విరబూశాయి. మోడీ, చంద్రబాబు నవ్వడంతో పవన్ కూడా చేతిలో ఉన్న చాక్లెట్ ను చూసుకుని వారితో కలిసి తాను కూడా నవ్వేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Read Also: PM Modi : రాజధాని అమరావతికి చేరుకున్న ప్రధాని మోడీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati Reconstruction Assembly
  • CM Chandrababu
  • Deputy CM Pawan Kalyan
  • Minister Lokesh
  • pm modi

Related News

CM Chandrababu's Remarks at the 7th Phase Collectors' Conference

CM Chandrababu : మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం

పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పని తీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఉద్యోగులు వినూత్నంగా ఆలోచనలు చేసేలా ప్రోత్

    Latest News

    • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

    • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

    • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

    • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

    • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd