HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Pawan Speech Amaravati Relaunch

Amaravati Relaunch : అమరావతి ప్రపంచస్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది – పవన్‌

Amaravati Relaunch : ప్రధాని మోదీ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తున్నారని ప్రశంసిస్తూ, అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరించినట్లు తెలిపారు

  • Author : Sudheer Date : 02-05-2025 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Speech Amaravati
Pawan Speech Amaravati

రాజధాని అమరావతి పునర్ నిర్మాణ (Amaravati Relaunch) పనులకు ప్రధాని మోదీ (Modi) ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ఈ కార్యక్రమానికి తరలి వచ్చారు. ఈ పునర్ నిర్మాణ పనుల్లో భాగంగా వేల కోట్ల రూపాయిల పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు.

పునఃప్రారంభమైన అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా అభివృద్ధి చేస్తామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదు, దేశానికే తలమానికంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అమరావతిని తుపానులా తుడిచేసిందని, కానీ ఇప్పుడు కేంద్రం మరియు రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉండటంతో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

Quantum Valley : వచ్చే ఏడాది జనవరి 1న అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం

అమరావతి రైతుల త్యాగాలు అమోఘమని పవన్ కల్యాణ్ కొనియాడారు. ఐదేళ్లుగా బాధలు అనుభవించిన రైతులు లాఠీదెబ్బలు తిని, కన్నీళ్లు పెట్టుకున్నారనీ, “మా కన్నీళ్లు తుడిచేవారెవరూ?” అని తనను అడిగిన సందర్భాలను గుర్తు చేశారు. తాను వారి త్యాగాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. అమరావతి రైతులు కేవలం భూములు ఇవ్వలేదు, రాష్ట్రానికి భవిష్యత్తునిచ్చారని, వారికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని అన్నారు.

పవన్ కల్యాణ్ చంద్రబాబు నాయకత్వాన్ని అభినందించారు. గతంలో ఆయన నేతృత్వంలో సైబరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టు ఇప్పుడు అమరావతిని అద్భుత రాజధానిగా తీర్చిదిద్దుతారని చెప్పారు. చంద్రబాబుతో కలిసి పని చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని తన కుటుంబంగా భావిస్తున్నారని ప్రశంసిస్తూ, అమరావతి పునఃప్రారంభానికి విచ్చేసిన ప్రధానికి చేతులెత్తి నమస్కరించినట్లు తెలిపారు. ఇది ఒక సాధారణ పునఃప్రారంభం కాదు, ఏపీ ప్రజల ఆశలకు కొత్త చిగురుసమానమని పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా వ్యక్తపరిచారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • Amaravati Relaunch
  • Amaravati Relaunch event
  • chandrababu
  • modi
  • Pawan Kalyan Speech

Related News

Chandrababu Once Again Show

CBN Birthday : మరోసారి గొప్ప మనసు చాటుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు రోజంతా ఉచితంగా భోజనం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పేదవాడి ఆకలి తీర్చడమే లక్ష్యంగా గతంలో ప్రారంభించిన ఈ అన్న క్యాంటీన్లు, నేడు పండుగ వాతావరణంలో వేలాది మందికి ఉచితంగా ఆకలి తీరుస్తున్నాయి

  • I entered politics with the aim of serving the public: CM Chandrababu

    Chandrababu Campaign : తమిళనాడులో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

  • Radisson Blu 5-star property set to enter the City of Bulls Ongole

    Andhra Pradesh: ఏపీలో రూ.82.49 కోట్లతో ఫైవ్ స్టార్ హోటల్

  • Nara Lokesh

    Nara Lokesh : తెలుగుదేశం ‘యువ’ గర్జన.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ పట్టాభిషేకం!

  • Perninani Rappa Rappa

    Amaravati : అమరావతి మునిగిపోవాలని కోరుకుంటున్న పేర్ని నాని..! ఇదేనా ప్రజానాయకుడి తీరు ?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd