HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >I Am Interested In That Matter Rs I Bought Books With 2 Lakhs Pawan Kalyan

Pawan Kalyan: ఆ విష‌యంలో నాకు క‌క్కుర్తి.. రూ. 2 లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాను: పవన్

నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారన్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చ‌ద‌వాల‌ని సూచించారు.

  • Author : Gopi Date : 02-01-2025 - 11:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan:
Pawan Kalyan:

Pawan Kalyan: తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. గురువారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు పుస్త‌కాల ప‌ట్ల ఉన్న ప్రేమ‌ను ప‌వ‌న్ వివ‌రించారు. పుస్త‌కాలు చ‌ద‌వ‌టం అంటే త‌న‌కు ఇష్ట‌మని ఆయ‌న తెలిపారు. అలాగే ప్ర‌తి ఒక్క‌రూ పుస్త‌క ప్రియులు కావాల‌ని ప‌వ‌న్ ఆకాక్షించారు. అయితే త‌న‌కు పాకెట్ మ‌నీ కావాలంటే త‌న వ‌దిన సురేఖ‌ను అడిగేవాడ్ని అని తెలిపారు. ఆమె ఇచ్చిన డ‌బ్బుతో ద‌గ్గ‌ర‌లో ఉన్న బుక్ స్టాల్‌కు వెళ్లి త‌న‌కు ఇష్ట‌మైన పుస్త‌కాన్ని కొనుక్కునేవాడ్ని అని ప‌వ‌న్ వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని కూడా పంచుకున్నారు.

తొలిప్రేమ సినిమా రెమ్యూన‌రేష‌న్‌లో కొంత మొత్తంతో పుస్త‌కాలు కొన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆ సినిమాకి రూ 15 ల‌క్ష‌ల రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న‌ట్లు స్పష్టం చేశారు. అయితే ఆ పారితోషికంలో సుమారు రూ. 2 ల‌క్ష‌లు పెట్టి బుక్స్ కొన్న‌ట్లు చెప్పారు. త‌న‌కు బుక్స్ షాప్‌కి వెళ్తే బ్యాంక్ వాల్ట్‌కు వెళ్లి ల‌క్ష‌ల కోట్లు క‌నిపిస్తే ఎలా ఉంటుందో బుక్స్ చూస్తే త‌న‌కు అలా ఉంటుంద‌ని అన్నారు. ఆయ‌న కోరుకున్న పుస్త‌కాలు కావ‌టంతోనే అంత డ‌బ్బు ఖ‌ర్చుపెట్టిన‌ట్లు చెప్పారు. అయితే బుక్స్ కొన్న త‌ర్వాత మూడు రోజులు నిద్ర‌పోలేద‌ని తెలిపారు. అన్ని బుక్స్ చూసే స‌రికి త‌న‌కు నిద్ర రాలేద‌ని ఏదో బుక్ తీయ‌టం కాస్త చ‌ద‌వ‌టం, మ‌ళ్లీ వేరే బుక్ చ‌ద‌వ‌టం లాంటివి చేసిన‌ట్లు చెప్పారు. పుస్త‌కాల విష‌యంలో క‌క్కుర్తి ఎక్కువ‌గా ఉంద‌ని చెప్పారు. త‌న‌కు పిల్ల‌ల‌కు కూడా పుస్తకాలు చ‌ద‌వ‌డం అల‌వాటు చేసుకోవాల‌ని చెప్పిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తుచేసుకున్నారు.

Also Read: Game Changer Event: మెగా అభిమానుల‌కు డబుల్ బొనాంజా.. ఒకే వేదిక‌పై ప‌వ‌న్‌, రామ్‌ చ‌ర‌ణ్‌

సోషల్ మీడియా కాదు.. పుస్తకం పట్టండి

నేటి తరం ఫేస్ బుక్, ట్విట్టర్ లోనే అధిక సమయం గడుపుతున్నారన్నారు. దానికంటే మానసికంగా మనల్ని బలవంతులు చేసే పుస్తకాలను ఎంచుకొని చ‌ద‌వాల‌ని సూచించారు. దీనివల్ల మానసికంగా బలంగా అవుతామ‌ని, సమస్యలను, కష్టాలను, మనుషులను అర్ధం చేసుకునే తత్వం బోధపడుతుంద‌న్నారు. సోషల్ మీడియాలో గంటలకు గంటలు గడిపేకంటే పోరాటం చేసే శక్తిని నింపే పుస్తకాలను పట్టుకోండని పిలుపునిచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • books
  • DCM Pawan Kalyan
  • Pawan Suggestions
  • social media
  • vijayawada

Related News

Indrakeeladri

Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయానికి భక్తుల రాక పెరిగి, క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుం

  • Electric Shock

    Vijayawada : విజయవాడలో బక్రీద్ పండుగ రోజు విషాద ఘటన.. కరెంట్ షాక్‌తో హోంగార్డు మృతి

  • More Good News for DWCRA Women: Loans Up to ₹10 Lakhs

    Dwcra Womens: డ్వాక్రా మహిళలకు మరో శుభవార్త.. రూ.10 లక్షల వరకు రుణం

  • Indrakeeladri

    Vijayawada : ఇంద్రకీలాద్రి ఆల‌యానికి పోటెత్తిన భ‌క్తులు

Latest News

  • CM Revanth Reddy : రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌పై వెనక్కి తగ్గేది లేదు : సీఎం రేవంత్ రెడ్డి

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd