HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Humkarini Shakti Peetha Is One Of The Eighteen Great Shakti Peethas In India

Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • By Vamsi Chowdary Korata Published Date - 10:24 AM, Thu - 25 September 25
  • daily-hunt
Pithapuram
Pithapuram
Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం పిఠాపురంలోని కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు.

Pithapuram Charitra : ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పిఠాపురం హాట్‌ టాపిక్‌. ఏ నోట విన్నా పిఠాపురం మాటే. ఈ పిఠాపురం.. కాకినాడ జిల్లాలో ఉంది. అయితే.. పిఠాపురాన్ని పూర్వం పీఠికాపురం అనేవారు. ఈ ఊరికి అధిపతి పీఠాంబ. కుక్కుటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో పురుహూతికా దేవి ఆలయం ఉంది. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం ఈ కుక్కుటేశ్వరుడి దేవాలయంలో ఉండేది. పుస్తకాలలో, పురాణాలలో ఉన్న ఈ పీఠం కాని, ఆ శక్తి విగ్రహం కాని ప్రస్తుతం కనబడవు. ఈ పీఠం మూలంగానే పిఠాపురానికి పీఠికాపురం అనే పేరు వచ్చిందని అంటారు. ఈ హుంకారిణీ శక్తి విగ్రహం రైల్వే స్టేషనుకి ఎదురుగా ఉన్న మట్టి దిబ్బలో భూస్థాపితమై ఉన్నదని లోక ఐతిహ్యం ఉంది. ఇంకా ఇక్కడ కుంతి మాధవస్వామి ఆలయం, నూకాలమ్మ గుడి కూడా విశేషమైనవి.

అయితే.. రచయిత ర్యాలీ ప్రసాద్ ‘పిఠాపురం చరిత్ర’ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ‘రాణి సీతాదేవీ’ సంబంధించిన వివరాల ప్రకారం.. పిఠాపురం రాజా కుటుంబం నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగుపెట్టిన యువరాణి పేరు సీతాదేవీ.. ఆ తర్వాత బరోడా సంస్థానాధీశుడిని పెళ్లి చేసుకున్నారు. తన రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డురావడంతో ఆమె ఇస్లాం మతంలోకి మారారు. పెళ్లి చేసుకున్నాక మళ్లీ హిందువుగా మారారు. 80 ఏళ్ల కిందటి రాణి సీతాదేవి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు చాలా ఆసక్తిగా ఉంటాయి. వివరాల్లోకెళ్తే..

దేశంలోనే అత్యంత విలాసవంతమైన జీవనం గడిపిన మహారాణిగా ఆమెను చరిత్రకారులు చెబుతారు. వారికి అప్పట్లోనే సొంతంగా ఎయిర్ జెట్ ఉండేదట. అలాగే.. సౌందర్యవతి కూడా. అయితే.. బరోడాకు చెందిన మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్ ఆనాటికి దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతుండేవారు. ఆయనకు గుర్రపు పందేల మీద విపరీతమైన మక్కువ. అలా మద్రాసులో అడుగుపెట్టిన ప్రతాప్ సింగ్‌ గుర్రపు పందేల క్లబ్బు వద్ద పిఠాపురం యువరాణి సీతాదేవిని చూశారు. తొలిచూపులోనే ఆమె అందానికి మైమరిచిపోయారు. అయితే.. అప్పటికే ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేకా వెంకయ్యప్పారావును సీతాదేవి వివాహం చేసుకుని ఉన్నారు. వీరికి 1935లో వివాహం జరిగింది. అప్పటికే ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే.. తన భర్త అయిన ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవీ రేసులకు తరచూ హాజరయ్యేవారు.

సీతాదేవికి పెళ్లి అయినా కూడా ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రతాప్‌సింగ్ సిద్ధం కావడమే ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌. ప్రతాప్ సింగ్‌కు కూడా అప్పటికే మరొకరితో పెళ్లయ్యింది. అయిత బరోడా రాజు ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌తో పెళ్లికి రాణీ సీతాదేవి కూడా అంగీకరించినప్పటికీ వారి వివాహానికి నిబంధనలు అడ్డురావడంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా బరోడా సంస్థానం కట్టుబాట్లను అనుసరించి మహారాజా కుటుంబంలో రెండో వివాహానికి అవకాశం లేదు. అప్పటికే సీతాదేవి తొలి వివాహం చేసుకుని ఉండటం కూడా వివాహానికి మరో అడ్డంకిగా మారింది.

ఈ నిబంధనలు అధిగమించి తమ వివాహానికి ఆటంకాలు తొలిగించుకోవాలని ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌, సీతాదేవి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. బరోడా సంస్థానంలో న్యాయ నిపుణుల సలహాతో మత మార్పిడికి సిద్ధమయ్యారు. మతం మారితే బరోడాలో అమలవుతున్న హిందూ వివాహ చట్టం పరిధి నుంచి తప్పించుకోవచ్చని భావించారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. రాణీ సీతాదేవి కూడా ఇస్లాం మతం స్వీకరించి, దాని ప్రకారం ఉయ్యూరు రాజా నుంచి విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత మళ్లీ హిందూమతాన్ని స్వీకరించి.. 1943లో ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌ ని వివాహం చేసుకున్నారు. వివాహం విషయమై అప్పట్లో బ్రిటీష్ వైస్రాయ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్న తర్వాత ఆమెకు రెండో వివాహానికి అడ్డంకులుండవని, ఇక రెండో వివాహం నిషేధం చట్టంపై స్పందిస్తూ.. రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు.

ఇక రాజ్యానికి వారసుడు గైక్వాడ్ మొదటి భార్య శాంతాదేవి కొడుకే అవుతాడనే షరతుపై వివాహాన్ని వైస్రాయ్ గుర్తించారు. అయితే.. అప్పట్లో సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఆమెను రాజ్యంలోని మహారాణులను ప్రోటోకాల్ ప్రకారం పిలిచే ‘హర్ హైనెస్’ గా సంబోధించకూడదని నిర్ణయించారు. అయితే సీతాదేవి రాకతో రాజకుటుంబంలో గందరగోళం నెలకొంది. ప్రతాప్‌సింహారావు మొదటి భార్య శాంతాదేవితో సీతాదేవికి పొసిగేది కాదు.
దీంతో ఇద్దరు రాణులు విడివిడిగా నివసించేవారు. శాంతాదేవి లక్ష్మీవిలాస్ ప్యాలెస్‌లో, సీతాదేవి మకరపుర ప్యాలెస్‌లో ఉండేవారట. ఈ క్రమంలో 1945లో వారికి వారసుడు శాయాజీరావు గైక్వాడ్ జన్మించారు. అదే సంవత్సరంలో ఆమె మొనాకోలోని మాంటీకార్లోకి వలస వెళ్లారు. అప్పటికే మాంటీకార్లో నగరం విలాసవంతమైన జీవితాలకు, కాసినో సహా అనేక జూద క్రీడలకు కేంద్రంగా ఉండేది. రేసు గుర్రాలు సహా వివిధ పందేలకు అలవాటు పడిన రాణీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Charitra
  • devotional
  • history
  • HumkariniShaktiPeetha
  • india
  • pithapuram
  • ShaktiPeethas

Related News

Kartika Purnima

Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

ధనుస్సు రాశి, మకర రాశి వారు శెనగపప్పు, అరటిపండు, పసుపు వస్త్రాలు, కుంకుమపువ్వు, పసుపు, మొక్కజొన్న దానం చేయడం ద్వారా సంతానానికి అదృష్టం (సౌభాగ్యం) లభిస్తుంది.

  • Stampede Incidents Kashibug

    2025 Stampede incidents In India: తొక్కిసలాట ఘటనల్లో 114 మంది ప్రాణాలు

  • Lord Shiva Vishnu

    Kartik Purnima : నవంబర్‌ 1 పవిత్రమైన దేవుత్తని ఏకాదశి.. కార్తీక మాసం!

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

  • India vs Pakistan

    India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!

Latest News

  • Kartika Purnima : కార్తీక మాసం – ఉసిరి దీపం ఎందుకు పెడతారు?

  • PM Modi: రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టు!

  • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

  • Suryakumar Yadav: సూర్య‌కుమార్‌, హారిస్ రౌఫ్‌కు షాకిచ్చిన ఐసీసీ!

  • SIR : SIRకు వ్యతిరేకంగా బెంగాల్లో భారీ ర్యాలీ

Trending News

    • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

    • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

    • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    • Road Accident : ఆర్టీసీ ప్రయాణానికి కూడా రక్షణ కరువేనా…? గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు !!

    • Tollywood : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. బాలకృష్ణ, నాగచైతన్య సినిమాల వాయిదా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd