HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >How Many Non Hindu Employees Are There In Tirumala What Are The Obstacles To Their Removal

Non Hindu Employees : తిరుమలలో హిందూయేతర ఉద్యోగులు.. ఏపీ సర్కారు ఏం చేయబోతోంది ?

ఎందుకంటే.. హిందూయేతరులను(Non Hindu Employees) తిరుమలకు సంబంధించిన ఉద్యోగులలో నియమించకూడదని 2007లో ఉత్తర్వులు వచ్చాయి.

  • Author : Pasha Date : 20-11-2024 - 4:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Non Hindu Employees Tirumala Ttd Andhra Pradesh Tirumala Tirupati Devasthanam

Non Hindu Employees : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్యమతస్తుల అంశంపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. వారి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది ?  హిందూయేతర మతాలకు చెందిన ఆ ఉద్యోగులను ఇతర చోట్లకు బదిలీ చేస్తారా ? వీఆర్ఎస్ ఇస్తారా ? అనే దానిపై డిస్కషన్ నడుస్తోంది. ఈ అంశంపై ఏపీ సర్కారు కసరత్తును ప్రారంభించిందని  సమాచారం. ఈనేపథ్యంలో టీటీడీలోని అన్య మతాల ఉద్యోగులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు.

Also Read :US Vs Russia : అమెరికాకు రష్యా భయం.. ఉక్రెయిన్‌ రాజధానిలో ఎంబసీకి తాళం

గతంలోకి వెళితే.. ప్రస్తుతం టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్య మతస్తులంతా 2007 సంవత్సరం కంటే ముందు రిక్రూట్ అయినవారు. 2007 తర్వాత అన్య మతస్తులను టీటీడీ రిక్రూట్ చేసుకోలేదు. ఎందుకంటే.. హిందూయేతరులను(Non Hindu Employees) తిరుమలకు సంబంధించిన ఉద్యోగులలో నియమించకూడదని 2007లో ఉత్తర్వులు వచ్చాయి. కొత్తగా నియమించుకునే వారి మత విశ్వాసాలపై ఎంక్వైరీ చేశాకే  ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టంగా ఉంది. 2007 కంటే ముందు టీటీడీలోని వివిధ విభాగాల్లో రిక్రూట్ అయిన వారిలో చాలా మంది ఇప్పటికే పదవీ విరమణ చేశారు. 2017లో నాటి ఓ టీటీడీ అధికారిని చర్చిలోకి వెళ్లడం వివాదానికి దారితీసింది. ఆమెపై అప్పట్లో హిందూ సంఘాలు టీటీడీకి ఫిర్యాదు చేశాయి.

Also Read :Upasana : అయ్యప్ప మాలలో కడప దర్గాకు రామ్‌చరణ్‌.. విమర్శలపై ఉపాసన రియాక్షన్

ప్రస్తుతం తిరుమలలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 44 మంది మాత్రమే అన్యమతస్తులు ఉన్నారు. వీరిలో 39 మంది 2007 కంటే ముందే రిక్రూట్ అయ్యారు. వీరిలోనూ అత్యధికులు కారుణ్య నియామకాల కింద రిక్రూట్ అయిన వారే కావడం గమనార్హం.  హిందూయేతర ఉద్యోగులంతా తిరుపతి పరిధిలో డ్రైవర్లు, అటెండర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. తిరుమలలో దాదాపు 7వేల మంది శాశ్వత ఉద్యోగులు, 14వేల మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉన్నారు. గతంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన 2 నెలలకే హిందూయేతర టీటీడీ ఉద్యోగులను తొలగిస్తామని అప్పటి టీటీడీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అయితే ఆ ప్రకటన అమల్లోకి రాలేదు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap
  • br naidu
  • jobs
  • Non Hindu Employees
  • tirumala
  • Tirumala Tirupati Devasthanam
  • Tirupati
  • ttd

Related News

Another major twist in the Tuni missing case: Key details revealed in the dog's post-mortem report.

Jnaneswari: తుని మిస్సింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్.. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా తుని పట్టణంలో సంచలనం సృష్టించిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు విచారణలో భాగంగా పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న పెంపుడు కుక్క మృతిపై అనుమానాలను నివృత్తి చేస్తూ అధికారులు పోస్ట్‌మార్టం నివేదికను విడుదల చేశారు. జూన్ 13న మరణించిన ఆ పెంపుడు కుక్కకు మరుసటి రోజే (జూన్ 14) పశువై

  • Cbn Speech

    Chandrababu : విశాఖ ఫార్మా సిటీ అగ్ని ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు విచారం

  • Health Minister

    AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd