HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >High Court Notices On Ap Coalition Governments Decision

Ration Rice Distribution: ఏపీ కూటమి ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టు నోటీసులు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది. వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు.

  • Author : Latha Suma Date : 31-05-2025 - 1:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Court notices on AP coalition government's decision
High Court notices on AP coalition government's decision

Ration Rice Distribution : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ సరఫరాలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించిన ప్రకారం, రాబోయే జూన్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డు లబ్దిదారులకు రేషన్ షాపుల ద్వారానే బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ఇంటింటి రేషన్ పంపిణీ వాహనాలను కొత్త ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయడం కొత్త దుమారం రేపుతోంది.

Read Also: Samantha : మళ్లీ ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించుకోలేదు – సమంత

వాహనాల రద్దుతో పాటు డ్రైవర్లు మరియు వారి కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి జారిపోతున్నామని వాపోతున్నారు. దాదాపు 9,260 రేషన్ వాహనాలు రాష్ట్రవ్యాప్తంగా సేవలందించగా, వాటిలో నాన్నగా జీవించే వేలాది మంది డ్రైవర్లు ఇప్పుడు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో రేషన్ వాహనాల తొలగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ కొంతమంది డ్రైవర్లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తమ వాహనాల కొనుగోలుకు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను 2027 వరకు చెల్లించాల్సిన బాధ్యత ఉందని వారు తెలిపారు. ప్రభుత్వం అకస్మాత్తుగా వాహనాల సేవలను నిలిపివేయడంతో రుణాలు తీర్చలేని స్థితిలోకి వచ్చామని, తమ కుటుంబాల ఉనికి స్వయంగా ప్రశ్నార్థకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన హైకోర్టు, వాహనాల రద్దుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వంతో అడిగి, స్పష్టతనివ్వాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

ఇక,  ప్రభుత్వ దృష్టిలో, గతంలో ఉన్న ఇంటింటి పంపిణీ విధానంలో అనేక అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకున్నాయని చెబుతోంది. అయితే, దీన్ని సమర్థించే ఆధారాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది. మరోవైపు ఉపాధి కోల్పోయిన డ్రైవర్లు ప్రభుత్వాన్ని ఆర్థిక పునరావాసం కల్పించాలన్న డిమాండ్ చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కీలక సవాలుగా మారింది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందా? లేదా రేషన్ వాహనాల పునరుద్ధరణకే మొగ్గు చూపుతుందా? అన్నది ఇప్పటికైతే అనిశ్చితంగా ఉంది. అయితే, ఈ కేసు తీర్పు వలన వాహన డ్రైవర్ల భవిష్యత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా లబ్దిదారులు ఇప్పుడు ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read Also: Bandi Sanjay : కల్వకుంట్ల సినిమాకు..కాంగ్రెస్‌ ప్రొడక్షన్‌: బండి సంజయ్‌


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • AP high court
  • Coalition Government
  • Notices
  • Ration Rice Distribution

Related News

FSSAI notices to Swiggy Instamart...

FSSAI: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నోటీసులు..

ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) షాక్ ఇచ్చింది. వినియోగదారుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో స్విగ్గీకి ఏకంగా తొమ్మిది నోటీసులు జారీ చేసినట్టు శనివారం వెల్లడించింది. గడువు ముగిసిన, పాడైపోయిన, కుళ్లిపోయిన, కలుషితమైన, అసురక్షిత ఆహార పదార్థాలను తమ ప్లాట్‌ఫామ్ ద్వారా సరఫరా చేస్తు

  • AP government's sensational decision regarding Brahmani Steels lands.

    Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

  • Good news from the AP government for BCs...

    CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • AP government takes another key decision

    CM Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd