HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kalvakuntla Movie Congress Production Bandi Sanjay

Bandi Sanjay : కల్వకుంట్ల సినిమాకు..కాంగ్రెస్‌ ప్రొడక్షన్‌: బండి సంజయ్‌

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న రాజకీయం గురించి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ప్రొడక్షన్‌ హౌస్‌గా మారిపోయింది. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు, కేసును తిప్పిచెప్పేందుకు, మా పార్టీతో కలవాలని ప్రయత్నించారు.

  • Author : Latha Suma Date : 31-05-2025 - 12:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kalvakuntla movie..Congress production: Bandi Sanjay
Kalvakuntla movie..Congress production: Bandi Sanjay

Bandi Sanjay : తెలంగాణ రాజకీయాలలో మరోసారి కలకలం రేపుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసు పూర్తిగా ఒక కుటుంబ నాటకం అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఇప్పుడు కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్‌ పేరుతో ఓ సినీ నాటకమే నడుస్తోంది. ఇందులో ప్రతిఒక్కరూ పాత్రధారులే. కాని ప్రజల కోసం నిజంగా కృషి చేసే పాత్ర ఎవ్వరికీ లేదు అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య సాగుతున్న రాజకీయం గురించి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు ప్రొడక్షన్‌ హౌస్‌గా మారిపోయింది. కవిత అరెస్టు కాకుండా ఉండేందుకు, కేసును తిప్పిచెప్పేందుకు, మా పార్టీతో కలవాలని ప్రయత్నించారు. కానీ బీజేపీ అవినీతిని ఏమాత్రం సహించదు. బీఆర్ఎస్‌తో బీజేపీ ఎప్పుడూ కలవదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు మాత్రమే కలిసి దేశ ప్రజలను మోసం చేస్తున్నాయని అన్నారు.

Read Also:Harish Rao : పీసీసీ అధ్యక్షుడి స్థాయికి తగినట్టు వ్యవహరించాలి: హరీశ్ రావు

వేములవాడలోని రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడంపై బండి సంజయ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన చాలా బాధాకరం. గోశాలలో తగిన రీతిలో సంరక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. త్వరలోనే ఈవోతో మాట్లాడి, కోడెల సంఖ్యకు అనుగుణంగా గోశాలను విస్తరించే విధానంపై చర్చిస్తాను అన్నారు. గోశాలల్లో మూగజీవాల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత శ్రద్ధ వహించాలని హితవు పలికారు. రాజన్న ఆలయానికి సంబంధించిన నిధులను గతంలో మాజీ సీఎం వేరే అవసరాల కోసం వినియోగించారని బండి సంజయ్ ఆరోపించారు. ఈ ఆలయం రాష్ట్ర ఆస్తి మాత్రమే కాదు, ప్రజల విశ్వాసానికి ప్రతీక. ఈ నిధులు పక్కదారి పడటం నైతికంగా తప్పు. దీనిపై విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు.

మన సైన్యం ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. పాక్‌పై యుద్ధం ఇంకా కొనసాగుతుందని ప్రధాని మోడీ చెప్పారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించే వరకు యుద్ధం కొనసాగుతుంది అని బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలను బండి సంజయ్‌ కేంద్రంగా విమర్శిస్తూ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్ కూటమిపై తీవ్రంగా దాడి చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

Read Also: Real Estate : చంద్రన్న ‘పవర్’ కు ఏలూరు లో ఊపందుకున్న రియల్ ఎస్టేట్

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • bjp
  • brs
  • BRS MLC kavitha
  • congress

Related News

DK SHIVA KUMAR

CM DK SHIVAKUMAR : కర్ణాటక ముఖ్యమంత్రిగా నేడు డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం

కర్ణాటక రాజకీయాల్లో షూటర్ గా పేరొందిన డీకే శివ‌కుమార్‌.. ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. కర్ణాటక ఈ రోజు సాయంత్రం 6గంట‌ల‌కు రాష్ట్ర క‌ర్ణాట‌క‌ 34వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన డీకే శివకుమార్, పదవీ విరమణ చేస్తున్న ముఖ్యమంత్రి సిద్ధారామ‌య్య నుంచి అధికార బాధ్యతలు స్వీకరించనున్నారు. లోక్‌భవన్‌లో జరగనున్న ఈ క

  • Balka Suman

    BRS : బాల్కా సుమన్‌కు ఊరట.. సింగరేణి కేసులో కీలక అభియోగాలను కొట్టివేసిన కోర్టు

  • west bengal

    BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

  • Mynampalli Rohith

    Jaggareddy : మెదక్‌కు డైనమిక్ నాయకుడు అవసరం.. రోహిత్‌పై జగ్గారెడ్డి ప్రశంసలు

  • Revanth Speech

    CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

Latest News

  • Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

  • Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. రెండు బ‌స్సులు ఢీ.. 7గురు మృతి

  • AP : గోదావరి పుష్కరాలు-2027పై సీఎం చంద్రబాబు సమీక్ష ..త్వరలో పుష్కర లోగో విడుదల

  • Pawan Kalyan: తెలంగాణలో పోటీ చేస్తాం పవన్ కళ్యాణ్

  • TDP MLAs: తప్పులు చేస్తే ఊరుకునేది లేదు.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు వార్నింగ్

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd