HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Heavy Rain Forecast For Several Districts In Ap Today

Rain Alert: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

  • Author : Vamsi Chowdary Korata Date : 12-06-2026 - 9:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Heavy rain forecast for several districts in AP today.
Heavy rain forecast for several districts in AP today.

ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతూ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే రాయలసీమ, కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాలను తాకిన రుతుపవనాలు, రాబోయే రెండు మూడు రోజుల్లో ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా పూర్తిగా విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉండటంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా, తెలంగాణ నుంచి దక్షిణ కోస్తా వరకు మరో ద్రోణి ఏర్పడింది. ఈ వాతావరణ వ్యవస్థల ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా శుక్రవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా, నంద్యాల, కడప, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు పోలవరం, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, ప్రకాశం, నెల్లూరుతో పాటు పలు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం కురిసే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని సూచించింది. ఇప్పటికే బుధవారం రాత్రి నుంచి గురువారం వరకు విజయవాడతో పాటు ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఈ ఏడాది ఆరంభంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉంటుందనే అంచనాలు వెలువడినప్పటికీ, జూన్ నెలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుండటం రైతుల్లో ఆనందాన్ని నింపుతోంది. ప్రభుత్వం ఇప్పటికే పంట కాలువలకు నీటి విడుదల షెడ్యూల్ ప్రకటించడంతో, రైతులు ఖరీఫ్ సాగు పనులను ముమ్మరం చేశారు. తాజా వర్షాలు వ్యవసాయ పనులకు మరింత ఊతమిచ్చాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh rains
  • AP weather forecast
  • Heavy Rain Alert
  • Heavy Rainfall Alert
  • IMD Monsoon Forecast
  • southwest monsoon

Related News

Heavy rain warning for these districts in Telangana!

Rain Alert: తెలంగాణలో ఈ జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జులై 3 నుండి జులై 9 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ఉమ్మడిగా వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశాయి. రాబోయే 7 రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఉర

  • Heavy rains in AP

    Heavy Rain Alert: 24 గంటల్లో రాష్ట్రమంతా వర్షాలు

  • Low-pressure area in the Bay of Bengal

    Weather Update: రానున్న వారం రోజుల పాటు భారీ వర్షాలు

  • Low-pressure area in the Bay of Bengal

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

  • Heavy rains in AP

    Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

Latest News

  • Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?

  • Sting Energy Drink: స్కూళ్ల పరిధిలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ పై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం

  • Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

  • Ayatollah Ali Khamenei: ఖమేనీ అంత్యక్రియలు మోసల్లా మసీదుకు తరలింపు

  • Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

Trending News

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd