HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rains In Telangana Fresh Warning For These Districts

Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

  • Author : Vamsi Chowdary Korata Date : 27-06-2026 - 8:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Alert for the people of Telangana: Heavy rains in this district.
Alert for the people of Telangana: Heavy rains in this district.

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే మరో వారం రోజుల పాటు వర్షాలు నిరంతరాయంగా కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్‌లో స్పష్టం చేసింది. జూన్ 26 రాత్రి విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాష్ట్రంపై ద్రోణి ప్రభావం ఉండటంతో.. నేడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వాతావరణం తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తూ, భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి సహా మిగిలిన జిల్లాల్లో 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తూ మోస్తరు వర్షాలు పడవచ్చు.

జూన్ 28న కూడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు విస్తరించనున్నాయి. కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

జూన్ 29 వరకు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాలపై వర్షాల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి వంటి జిల్లాలతో పాటు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాల సూచన ఉంది. ఆ తర్వాత జూన్ 30 వరకు మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయి. జూన్ 30 నుంచి జూలై 1 వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain
  • Heavy Rain Alert
  • Heavy Rain In Hyderabad
  • Heavy Rain In Telangana
  • IMD weather report
  • Telangana Weather Report
  • weather report

Related News

Alert for the people of Telangana: Heavy rains in this district.

Rain Alert: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ జిల్లాలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాగల 24 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భార

  • Alert for the people of Telangana: Heavy rains in this district.

    Rain Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: ఏపీలో భారీ వర్షాలు.. కమ్ము కోస్తున్న కారు మబ్బులు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: ప్రజలకు చల్లటి కబురు.. నేడు ఆ జిల్లాల్లో వానలు

  • Heavy rains in AP... Dark clouds gathering.

    Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు

Latest News

  • Komatireddy Raj Gopal Reddy : ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • Viral : హైదరాబాద్ కేబీఆర్ పార్క్ లో 20 అడుగుల భారీ కొండ చిలువ

  • Vizag : పవన్ నటన నేర్చుకున్న భవనం కూల్చివేత

  • Salman Khan New Pic : సల్మాన్ కు ఏమైంది..? ఇలా అయ్యాడేంటి ?

  • PV Sindhu Scripts History : కంగ్రాట్స్ చెప్పిన పవన్ కళ్యాణ్‌కు సింధు ఎలాంటి రిప్లయ్ ఇచ్చిందో తెలుసా ?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd