Amaravati : అమరావతికి గుడ్ న్యూస్
అమరావతికి గుర్తింపు వచ్చింది. ఎయిర్ ఇండియా కంపెని గుర్తించింది. అమరావతి ప్రజలకు ఈ గుర్తింపు కాస్త ఆనందం కలిగించింది. ఎయిర్ ఇండియా కంపెనీ ఏపీ రాజధాని అమరావతిగా రికార్డుల్లో పెట్టింది.
- By CS Rao Published Date - 02:09 PM, Mon - 10 April 23

Good news for Amaravati : అమరావతికి గుర్తింపు వచ్చింది. ఎయిర్ ఇండియా కంపెని గుర్తించింది. అమరావతి (Amaravati) ప్రజలకు ఈ గుర్తింపు కాస్త ఆనందం కలిగించింది. ఎయిర్ ఇండియా కంపెనీ ఏపీ రాజధాని అమరావతిగా రికార్డుల్లో పెట్టింది. ఢిల్లీ వెళ్లే విమానాల్లో గన్నవరం టూ ఢిల్లీ అని ఎయిర్ ఇండియా పేర్కొనేది. కానీ, సోమవారం నుంచి అమరావతి టూ ఢిల్లీ అని వెబ్ సైట్‌లో పేరు మార్చింది. టిక్కెట్ స్టేటస్, ప్రకటనలో కూడా అమరావతి టూ ఢిల్లీ, ఢిల్లీ టూ అమరావతి అని ఎయిర్ ఇండియా యాజమాన్యం పేర్లు మార్చింది. దీంతో అమరావతి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఎయిర్ ఇండియాలో వచ్చిన మార్పుతో రాష్ట్ర ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా ఏపీ రాజధాని ఏదీ? అనే అంశంపై దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ప్రభుత్వంపై సెటైర్లు వేసే పరిస్థితి. విమానాలకు సంబంధించి టిక్కెట్ల విషయంలో కూడా గన్నవరం-ఢిల్లీ, గన్నవరం -చెన్నై, గన్నవరం – హైదరాబాద్ అని మాత్రమే ముద్రించేవాళ్లు. అయితే తాజాగా ఎయిర్ ఇండియా పేర్లు మార్చడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు 12వందల రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అన్ని పక్షాలు కూడా అమరావతినే కొనసాగించాలని కోరుతున్న విషయం తెలిసిందే.
కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీకి మూడు రాజధానులంటూ మాటమార్చి.. రాష్ట్రంలో రాజధాని లేకుండా చేసింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా ప్రకటన అమరావతి (Amaravati) వాసులతో పాటు రాష్ట్ర ప్రజలు ఆనందపడే విషయంగా చెప్పుకుంటున్నారు.
Also Read: Jagan AP CM: రామ రామ! జగన్ మడమ నొప్పికి మతం ముసుగు..