CM Chandrababu : నామినేటెడ్ పోస్టుల కోసం కసరత్తు : సీఎం చంద్రబాబు
పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదే. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలి.
- By Latha Suma Published Date - 03:41 PM, Fri - 14 March 25

CM Chandrababu : పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తులు చేస్తున్నామని చెప్పారు. పేర్లను సిఫారసు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం చేస్తున్నారని చెప్పారు. ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని కోరారు. సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తామని పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా 21 ప్రధాన ఆలయాలకు చైర్మన్లను నియమిస్తామని వెల్లడించారు.
Read Also: Janasena : ‘జయకేతనం’..సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు
పార్టీలకు అతీతంగా పథకాలు అందజేస్తున్నాం. సంక్షేమ పథకాలు వేరు.. రాజకీయ సంబంధాలు వేరు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులదే. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులు వారి జిల్లాల్లో పర్యటనల సంఖ్య పెంచాలి. కూటమిలోని మూడు పార్టీల నేతలు, కార్యకర్తలను కలుపుకొని ముందుకెళ్లాలి అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. టీడీపీ నేతలు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు. నేను ఇలా చెబితే.. వైసీపీకు ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని అన్నారు.
మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దు. రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలినవారికి అవకాశాలు కల్పిస్తాం. ఇప్పటికే పదవులు తీసుకున్నవారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం. ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడూ హుందాగా వ్యవహరించాలి. నామినేటెడ్ పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కూటమిలోని మూడు పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లాలని తెలిపారు.
Read Also: Bihar : తల్లి-కుమారుని కలిపిన ఇంటర్నెట్