TDP Yanamala : ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎందే – మాజీ మంత్రి యనమల
రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారన్నారు మాజీమంత్రి యనమల
- By Prasad Published Date - 03:32 PM, Sun - 5 February 23

రాష్ట్ర ఆర్దిక పరిస్థితిపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసంబద్ధంగా మాట్లాడుతున్నారన్నారు మాజీమంత్రి యనమల రామకృష్టుడు. వైసీపీ మూడున్నరేళ్ల పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని టీడీపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని… శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దమా? అని . అసలు ఆర్దిక శాఖలో ఏం జరుగుతుందో బుగ్గనకు తెలుసా? ఆయన ప్రశ్నించారు. ఆర్దిక శాఖపై పెత్తనమంతా సీఎందేనని… కాబట్టి జగన్ కి ఆర్దిక శాఖపై ఏమాత్రం అవగాహన ఉన్న తనతో బహిరంగ చర్చకు రమ్మని సవాల్ విసురుతున్నాని యనమల తెలిపారు. మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో బహిరంగ మార్కెట్ ద్వారా ఎన్ని కోట్ల అప్పులు తెచ్చారు, ఆర్బీఐ నుంచి తీసుకున్న వేస్ అండ్ మీన్స్ ఎంత ? ఓవర్ డ్రాప్ట్ ఎంత? వడ్డీ ఎంత కట్టారు? రెవెన్యూ, ప్రాధమిక, ద్రవ్య లోటు ఎంత? ఈ మూడున్నర సంవత్సరాల్లో ఖర్చు చేసిన మూలధన వ్యయం ఎంత? పీడీ అకౌంట్ లో నిధులు ఎంత వాడారు? పెండింగ్ బిల్స్ ఎన్ని ఉన్నాయి, ఉద్యోగులకు జీతాలు, జీపీఎఫ్, పీఆర్సీ ఎందుకు ఇవ్వడంలేదు? ఓపెన్ బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఎంత? వీటి వివరాలు కాగ్ కి కూడా ఎందుకివ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.