Deputy CM Pawan: నేడు ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
శుక్రవారం గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి పవన్ నడిచి వెళ్లారు.
- By Gopichand Published Date - 09:31 AM, Sat - 21 December 24

Deputy CM Pawan: ఉత్తరాంధ్రలోని ఏజెన్సీ గ్రామాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan) పర్యటన రెండు రోజు కూడా కొనసాగనుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుక్రవారం పర్యటించిన సంగతి తెలిసిందే. గిరి శిఖర గ్రామాల్లో డోలిమోతల కష్టాలను తీర్చడానికి 36.71 కోట్లతో రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఏజెన్సీ కొండలపై ప్రయాణం చేస్తూ వర్షాన్ని లెక్కచేయకుండా రోడ్ల నిర్మాణాలకు పవన్ శంకుస్థాపనలు చేయడం గమనార్హం.
నేడు అల్లూరి జిల్లాలో పర్యటన
నేడు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బల్లగరువులో రోడ్ల నిర్మాణాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపనలు చేయనున్నారు. ఎన్నికల హామీలో భాగంగా గిరిజన ప్రజల డోలి కష్టాలను తీరుస్తానని పవన్ ఇచ్చిన హామీ ప్రకారం రోడ్ల నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎంకు అక్కడి వాతావరణం ఎంతగానో ఆకట్టుకున్నట్లు సమాచారం. కారు దిగి నడుచుకుంటూ ఫోటోలు తీసుకుంటూ అనేక ప్రాంతాలను డెవలప్ చేయడానికి అనుకూలంగా ఉన్నాయని పవన్ అధికారులకు సూచించారు.
Also Read: Nigerian Gangs : స్టూడెంట్స్, ఉద్యోగుల ముసుగులో డ్రగ్స్ దందా.. వాళ్లకు చెక్
మన్యంలో మూడు రోజులు పర్యటిస్తా- పవన్
శుక్రవారం గిరిజన ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ప్రధాన మార్గం నుంచి బాగుజోల గ్రామానికి పవన్ నడిచి వెళ్లారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పేలా కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ‘‘గిరిజన యువతకు ఉపాధి, తాగునీరు, రోడ్లు లేవు. వెనుకబడ్డ ప్రాంతాల కోసం రూ.670 కోట్లు వస్తే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రతి 2 నెలల్లో 3రో జులు మన్యంలో పర్యటిస్తా’’ అని తెలిపారు.
ఫ్యాన్స్‌కు పవన్ చురకలు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిమానులకు చురకలు అంటించారు. ‘‘నన్ను పని చేసుకోనివ్వండి.. నేను బయటికొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చేయలేను. ఓజీ ఓజీ అని అరిస్తే పనులు జరగవు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారు. నేను మీసం తిప్పితే పనులు జరగవు’’ అని అసహనం వ్యక్తం చేశారు.