HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Drugs Mafia In The Guise Of Students Nigerian Gangs In Hyderabad

Nigerian Gangs : స్టూడెంట్స్, ఉద్యోగుల ముసుగులో డ్రగ్స్ దందా.. వాళ్లకు చెక్

ఈ తరహా డ్రగ్స్ నెట్‌వర్క్‌లలో(Nigerian Gangs) భాగంగా ఉన్న ఆఫ్రికన్ల ఏరివేతలో హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు బిజీగా ఉన్నారు.

  • Author : Pasha Date : 21-12-2024 - 9:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nigerian Drugs Mafia Foreign Students Hyderabad

Nigerian Gangs :  సీఎం రేవంత్ సర్కారు హైదరాబాద్‌లోని డ్రగ్స్ నెట్‌వర్క్‌లను ధ్వంసం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈక్రమంలో నగరంలో డ్రగ్స్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తున్న పలువురు నైజీరియన్లకు చెక్ పెడుతోంది. వీసా గడువు ముగిసినా.. చాలా ఏళ్లుగా సిటీలోనే అక్రమంగా ఉంటున్న నైజీరియన్లను గుర్తించడంపై ప్రస్తుతం పోలీసు విభాగం ఫోకస్ పెట్టింది. తరుచుగా అడ్రస్‌లు మారుస్తూ తప్పించుకు తిరుగుతున్న వారి ఆచూకీని గుర్తించేందుకు ప్రత్యేక టీమ్‌లను హైదరాబాద్ పోలీసు విభాగం రంగంలోకి దింపింది. అలాంటి వారిలో పలువురి ఆచూకీని ఇప్పటికే గుర్తించినట్లు సమాచారం.

Also Read :Car Attack : జర్మనీ క్రిస్మస్ మార్కెట్‌లో జనంపైకి కారు.. ఇద్దరి మృతి, 68 మందికి గాయాలు

హైదరాబాద్‌లోని కాలేజీల్లో అడ్మిషన్ల కోసం, కంపెనీల్లో ఉద్యోగాల కోసం ఏటా ఎంతోమంది ఆఫ్రికా దేశాల నుంచి వస్తుంటారు. అయితే అలాంటి వారిలో కొందరు డబ్బుపై అత్యాశతో డ్రగ్స్ ముఠాల్లో చేరిపోతుంటారు.  లగ్జరీ లైఫ్‌ను గడిపేందుకు డ్రగ్స్ సప్లై ఛైన్‌లో భాగంగా మారుతున్నారు. ఒక్కసారి ఈ ఛైన్‌లో చేరిన తర్వాత బయటపడటం వారికి చాలా కష్టతరంగా మారుతోంది. విదేశాల నుంచి మన దేశంలోని ముంబై, అహ్మదాబాద్, చెన్నై ఓడరేవులకు చేరే మాదక ద్రవ్యాలను సేకరించేందుకు ఆఫ్రికా దేశాల వారిని డ్రగ్స్ ముఠాలు వాడుకుంటున్నాయి. ఓడరేవుల నుంచి హైదరాబాద్ లాంటి ప్రధాన నగరాలకు మాదక ద్రవ్యాలను సేఫ్‌గా చేరిస్తే ఎంతోకొంత ముట్టజెప్పుతున్నాయి. అంతేకాదు హైదరాబాద్ సిటీ పరిధిలో కొందరు యువత, డ్రగ్స్ అలవాట్లు కలిగిన వారికి డ్రగ్స్‌ను సప్లై చేయడంలోనూ ఆఫ్రికా దేశాల నుంచి  వలస వచ్చిన వారినే డ్రగ్స్ ముఠాలు వాడుకుంటున్నాయి.

Also Read :Hindu Heritage Month : ఇకపై ఒహాయోలో హిందూ వారసత్వ మాసంగా అక్టోబరు

ఈ తరహా డ్రగ్స్ నెట్‌వర్క్‌లలో(Nigerian Gangs) భాగంగా ఉన్న ఆఫ్రికన్ల ఏరివేతలో హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. టీజీన్యాబ్, హెచ్‌న్యూ, నగర పోలీసు యంత్రాంగం కలిసికట్టుగా ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తున్నాయి. ఈ టీమ్‌ల రైడ్స్‌కు భయపడి.. ఇప్పటికే చాలామంది ముంబై, బెంగళూరు, గోవా, చెన్నై, ఢిల్లీలకు పారిపోయినట్లు తెలుస్తోంది.  వీసా గడువు ముగిసినా హైదరాబాద్‌లో ఉంటున్న ఆఫ్రికన్లను గుర్తించి వాళ్ల దేశాలకు తిరిగి పంపించేస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ సప్లై చేస్తున్న 103 మంది ఆఫ్రికన్లను గత ఏడేళ్లలో సిటీ నుంచి వాళ్ల దేశాలకు పంపించేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • Drugs Mafia
  • Foreign Students
  • hyderabad
  • Nigeria
  • Nigerian Gangs

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

    Latest News

    • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

    • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

    • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

    • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

    • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd