HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu To Visit Visakhapatnam On September 17

CM Chandrababu: సెప్టెంబర్ 17న విశాఖకు సీఎం చంద్రబాబు!

ఆ తర్వాత ముఖ్యమంత్రి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొంటారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు.

  • By Gopichand Published Date - 10:54 PM, Mon - 15 September 25
  • daily-hunt
Record In AP History
Record In AP History

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు (CM Chandrababu) ఈనెల 17వ తేదీన విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన మహిళా, శిశు ఆరోగ్య సంరక్షణతో పాటు, ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఉదయం 11:15 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.

అనంతరం ఆర్కే బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఉమెన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్‌లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఈ క్యాంప్‌లో మహిళలు, పిల్లల ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి అవసరమైన వైద్య సలహాలు, చికిత్స అందిస్తారు. ముఖ్యమంత్రి మధ్యాహ్నం 12 గంటలకు “స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమంపై ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంలో మహిళలు, కుటుంబాల సాధికారతకు సంబంధించిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరించే అవకాశం ఉంది.

Also Read: Panchmukhi Hanuman Ji: మంగ‌ళ‌వారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి పూజ చేయండిలా!

ఆ తర్వాత ముఖ్యమంత్రి గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్లో పాల్గొంటారు. ఈ సదస్సులో రాష్ట్ర ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు. అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, వ్యాపారవేత్తలు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సమ్మిట్ ద్వారా విశాఖను గ్లోబల్ సెంటర్‌గా మార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి గురించి వివరించనున్నారు. సాయంత్రం 5 గంటలకు విశాఖ నుంచి తిరిగి బయలుదేరుతారు. ఈ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీఎం పర్యటించే ప్రాంతాలన్నింటిలోనూ భద్రతను పటిష్టం చేశారు. ఈ పర్యటన విశాఖ అభివృద్ధికి, ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక రంగాల బలోపేతానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • ap news
  • CM Chandrababu
  • telugu news
  • Visakhapatnam

Related News

Andhra Pradesh Vs Karnataka

Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

రూ. 1,20,000 కోట్లకు పైగా విలువైన 1 గిగావాట్ గూగుల్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాజెక్టును ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో.. ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య పొలిటికల్ వార్‌కు దారితీసింది. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించిన గూగుల్, ఆ తర్వాత ఏపీకి మళ్లించింది. దీనిపై స్పందించిన కర్ణాటక కాంగ్రెస్.. ఏపీపై సంచలన ఆరోపణలు

  • Ap Electricity Problems

    Electricity Problems : ఏపీలో విద్యుత్ సమస్యలకు చెక్ పెట్టిన ప్రభుత్వం..ఎలా అంటే !!

  • Visakhapatnam Madugula Halw

    Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

  • CM Chandrababu

    CM Chandrababu: సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోదీ ఫోన్‌!

  • Pranahita-Chevella Project

    Pranahita-Chevella Project: ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం!

Latest News

  • Fake News : ఫేక్ ప్రచారం పై సైబర్‌క్రైమ్‌ పోలీసులకు టీ కాంగ్రెస్ ఫిర్యాదు

  • Good News to Farmers : రైతులకు కేంద్రం శుభవార్త

  • Indian Refineries : అమెరికా ఎఫెక్ట్? ..రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేసిన భారత్.!

  • Taskin Ahmed : సిక్సర్ బాదిన బంగ్లాదేశ్ ప్లేయర్.. అవుట్ ఇచ్చిన అంపైర్.. ఒక్కసారిగా షాక్!

  • Harish Rao Father Died : హరీశ్ రావు తండ్రి మృతి.. అంత్యక్రియలకు దూరంగా కవిత

Trending News

    • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    • Cyclone Montha : మాన్సూన్ తుపాను ప్రభావం పై చంద్రబాబు నాయుడు ట్వీట్: ప్రజలను రక్షించడానికి అన్ని చర్యలు చేపట్టాం.!

    • Andhra pradesh : ఏపీ ప్రజలకు మొంథా తుపాన్ అలర్ట్.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

    • Justice Surya Kant : హరియాణా నుంచి భారత్‌లో తొలి ప్రధాన న్యాయమూర్తిగా సూర్యకాంత్.!

    • Burn Utensils: మాడిపోయిన పాత్రలను ఈజీగా శుభ్రం చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd