HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Chandrababu Sipb Meeting Concludes With Approval For 19 Projects

CM Chandrababu: ముగిసిన ఎస్‌ఐపీబీ సమావేశం.. 19 ప్రాజెక్టులకు ఆమోదం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి వేగంగా ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తాజాగా రాష్ట్రంలో 19 ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపిందని వెల్లడించారు.

  • Author : Kode Mohan Sai Date : 15-05-2025 - 5:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sipb Meeting In Amaravati
Sipb Meeting In Amaravati

రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వ పటిష్టమైన పాలసీల ప్రభావంతో దేశీయ, విదేశీ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు.

ఇప్పటివరకు ఆరు ఎస్‌ఐపీబీ ( State Investment Promotion Board) సమావేశాల్లో 76 ప్రాజెక్టులకు రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగనున్నాయని చెప్పారు. ఒప్పందాలు చేసుకున్న సంస్థల పనుల పురోగతిని డాష్‌బోర్డు ద్వారా పర్యవేక్షించాలనన్నారు.

CM అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఆరో ఎస్‌ఐపీబీ సమావేశంలో 19 కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన రూ.33,000 కోట్ల పెట్టుబడులను ఆమోదించారు. దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే వీటి ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ వంటి విభాగాల్లో పెట్టుబడులకు అనేక సంస్థలు ముందుకొచ్చినట్లు తెలిపారు.

ప్రతి ఒప్పంద సంస్థ ప్రాజెక్టును శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షించాలనీ, ప్రతీ ప్రాజెక్ట్ పురోగతిపై క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయాలనీ సీఎం సూచించారు. పెట్టుబడుల స్థితిగతులపై సమాచారం అందేందుకు ప్రత్యేక డాష్‌బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

టూరిజం రంగంలో హోటళ్లకు, గదులకు తీవ్ర కొరత ఉన్నదని సీఎం పేర్కొన్నారు. పెద్ద ఎత్తున హోటల్ గదులు అందుబాటులోకి వస్తే పర్యాటక రంగానికి బలమవుతుందని అన్నారు. లక్ష్యంగా 50 వేల హోటల్ రూమ్‌లు అందుబాటులోకి తేవాలని తెలిపారు. అందుబాటు ధరల్లో గదులు ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారని వివరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Investments
  • AP Jobs
  • AP SIPB Meeting
  • CM Chandrababu
  • State Investment Promotion Board (SIPB)

Related News

Iftar Ramadan

Ramadan 2026 : ఏపీ ప్రభుత్వ ‘ఇఫ్తార్’.. హాజరుకానున్న సీఎం

రాష్ట్ర స్థాయి ప్రధాన ఇఫ్తార్ వేడుక ఈ నెల 16వ తేదీన విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరై, ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు

  • Manoj Babu

    Andhra Govt to Ban Social Media : చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పై మంచు హీరో రియాక్షన్

Latest News

  • కడపల్లెలో కుటుంబ సాధికార సారథిగా సీఎం చంద్రబాబు

  • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

  • గ్యాస్ సంక్షోభం వేళ..ఇండక్షన్‌ స్టవ్‌లకు భారీ గిరాకీ

  • నాగార్జున 100వ సినిమా పై ఆసక్తికర అప్డేట్..

  • గంటలో ఇరాన్ విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేయగలమని.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd