HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Another Investment For Ap Chandrababu Secures A Massive Project

AP News: ఏపీలో మరో పెట్టుబడి.. భారీ ప్రాజెక్టు సొంతం చేసుకున్న చంద్రబాబు

  • Author : Vamsi Chowdary Korata Date : 30-06-2026 - 10:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for the unemployed in AP: The government is gearing up to fill government posts.
Good news for the unemployed in AP: The government is gearing up to fill government posts.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడుల వేటలో ఉంది.. రాష్ట్రానికి కంపెనీలు, పరిశ్రమలను తీసుకొచ్చే పనిలో ఉంది. గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాలకు వరుసగా కంపెనీలు క్యూ కట్టాయి. తాజాగా మరో ప్రముఖ కంపెనీ అడిడాస్ సంస్థకు షూస్ తయారు చేసి సరఫరా చేసే హ్వాసెంగ్ ఏపీలో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హ్వాసెంగ్ అడిడాస్‌కు షూస్ సప్లై చేయడంలో ప్రధాన భాగస్వామిగా ఉంది. హ్వాసెంగ్‌కు ప్రస్తుతం చైనా, వియత్నాం, దక్షిణ కొరియా, తైవాన్, ఇండోనేషియాలో యూనిట్లు ఉన్నాయి. ఆ ఐదు దేశాల తర్వాత భారత్‌లో, అందులోనూ ఏపీలో తొలి ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

వాస్తవానికి హ్వాసెంగ్ దేశంలో తొలి యూనిట్‌ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుందనే చర్చ జరిగింది. తమిళనాడు ప్రభుత్వం అక్కడ యూనిట్ ఏర్పాటయ్యేలా ప్రయత్నాలు చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతేడాది ఆగస్టు నెలలో షూస్ ప్లాంటును (నాన్-లెదర్ స్పోర్ట్స్) తూత్తుకుడి జిల్లాలో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకుని.. దీనికి అవసరమైన ఒప్పందం కూడా చేసుకుంది. ఇంతలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీ, ఇక్కడి సింగిల్ విండో విధానం, రాయితీలు, వేగంగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇస్తున్నాయని తెలిసింది. ఏపీ ప్రభుత్వం కూడా తమ వైపు నుంచి ప్రయత్నాలు ప్రారంభించి.. హ్వాసెంగ్ కంపెనీతో సంప్రదింపులు జరిపింది.

ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి.. రాష్ట్రంలో పెట్టుబడికి హ్వాసెంగ్ కంపెనీ అంగీకారం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో యూనిట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరగా.. హ్వాసెంగ్ కంపెనీ అంగీకరించింది. కుప్పం నియోజకవర్గ పరిధిలోని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో ఈ యూనిట్ ఏర్పాటుకు 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. హ్వాసెంగ్ కంపెనీ ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా మూడు విడతల్లో రూ. 896 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ యూనిట్ ఏర్పాటుతో 17,465 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.. అందులోనూ మహిళలకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అంటున్నారు. కుప్పంలో ఏర్పాటు చేయబోయే హ్వాసెంగ్ యూనిట్ నుంచి ఏడాదికి 20 లక్షల జతల షూస్ ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ నెల 3 లేదా 4న యూనిట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హ్వాసెంగ్ ప్రతినిధులు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు జులై 1 నుంచి 5 వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పర్యటిస్తారు. జులై 1న నెల్లూరు జిల్లాలో పర్యటించి పింఛన్లు పంపిణీ చేస్తారు. అదే రోజు తిరుపతి జిల్లా శ్రీసిటీలో హీరో మోటో కార్ప్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్‌కు శంకుస్థాపన చేస్తారు. జులై 2న

తిరుపతి జిల్లా రైల్వేకోడూరులో నిర్వహిస్తున్న వీబీ జీ రామ్‌జీ పథకం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుపతిలో జీఎస్‌డీపీ కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాపునకు హాజరవుతారు. జులై 3న కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం సున్నపురాళ్లపల్లెలో రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ పనులను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వెళ్తారు.. ఈ నెల 3 నుంచి 5 వరకు పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP CM Chandrababu
  • footwear
  • Hwaseung
  • kuppam

Related News

Rising COVID-19 cases in AP

COVID: ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో చాప కింద నీరులా కరోనా మళ్లీ విస్తరిస్తోంది. ఒకప్పుడు కరోనా సృష్టించిన విలయతాండవం ఎవ్వరూ మరచిపోలేనిది. తల్లడిల్లుతూ పోయిన ప్రాణాలు ఇప్పటికీ కళ్ల ముందే కదులుతున్నాయి. అలాంటి మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలో వెలుగుచూసిన కోవిడ్ పాజిటివ్ కేసుల నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెర్చ్ సంస్థలో పరీక్షించగా, అవి RF 5

  • 9 arrested in Guntur case involving the stripping of a woman.

    Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

  • Major twist in the Kadambari Jethwani intimidation case; the net closes in on the YCP leader.

    Kadambari Jethwani: కాదంబరి జెత్వాని బెదిరింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత చుట్టూ ఉచ్చు.

  • YouTuber Ravan's remand extended again.

    Joseph Ravan Remand Report: యూట్యూబర్‌ రావణ్‌కు మరోసారి రిమాండ్‌ పొడిగింపు

  • COVID-19 scare returns to AP; 12 cases reported across 4 districts.

    Covid: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. 4 జిల్లాల్లో 12 కొవిడ్‌ కేసులు

Latest News

  • Nara Lokesh: కాకినాడలో NBK111 షూటింగ్‌లో గాయపడిన నందమూరి బాలకృష్ణను మంత్రి నారా లోకేష్ ఫోన్‌లో పరామర్శించార

  • Bahrain: కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd