CM Chandrababu : వర్క్‌ఫ్రమ్ హోమ్‌కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన: సీఎం చంద్రబాబు
CM Chandrababu : గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసే వారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను రూ.4వేలకు పెంచాం. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారు.
- By Latha Suma Published Date - 05:16 PM, Tue - 1 October 24

CM Chandrababu distributed pensions : సీఎం చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లా పుచ్చకాయలమడ గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో ఆయన మాట్లాడుతూ..రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని ఆయన అన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ”వర్క్‌ఫ్రమ్ హోమ్” కు శ్రీకారం చుట్టాలనేది నా ఆలోచన. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు.
Read Also: CAG : ‘వికసిత్ భారత్’ పై కాగ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు.. చెట్లు కొట్టేసే వారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛను రూ.4వేలకు పెంచాం. ఒకటో తేదీన అధికారులు మీ ఇంటికొచ్చి పింఛను ఇస్తున్నారు. పింఛన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తాం. ఒకప్పుడు ఉద్యోగులకు జీతాలు సరిగా వచ్చేవి కావు. ఇప్పుడు ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పింఛన్లు ఇస్తున్నాం. జీతాల గురించి ఎవరూ ఆందోళన చెందవద్దు. ఎన్నికల్లో ఎంతో చైతన్యంతో కూటమికి ఓట్లు వేశారు. జగన్ వెళ్తూ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారు. మీరు ఎక్కువ మంది కూటమి ఎంపీలను గెలిపించి మంచి పనిచేశారు.
గత ఐదేళ్లలో ఒక్క ఎకరాకు నీరివ్వలేదు. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతాఇంతా కాదు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాది. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేశాం. రీ సర్వే పేరుతో ప్రజల భూముల సరిహద్దులు చెరిపేశారు.. వాటిని సరిచేస్తున్నాం. ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదుల్లో సగం భూ సమస్యలే ఉన్నాయి. భూ సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాం.. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనేది నా లక్ష్యం.
కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తాం. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తాం. మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చాం. రూ.100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతాం. ఓర్వకల్లులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు. గ్యాస్ సిలిండర్ పంపిణీని దీపావళి రోజు ప్రారంభిస్తాం. మహిళలకు ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. వాలంటీర్లు లేకపోతే ఏం చేయలేరన్నారు. వాళ్లు లేకపోయినా పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. వాలంటీర్లను ఏం చేయాలో ఆలోచిస్తున్నాం” అని సీఎం తెలిపారు.