Chief Minister Jagan Phone: ముఖ్యమంత్రి జగన్ దగ్గర ఫోన్ కూడా లేదా..? ఇది షాకింగే..!
ఏపీలో మే 13 తేదీన అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
- Author : Gopichand
Date : 10-05-2024 - 5:15 IST
Published By : Hashtagu Telugu Desk
Chief Minister Jagan Phone: ఏపీలో మే 13 తేదీన అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అధికార పార్టీ వైసీపీ.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Chief Minister Jagan Phone) ప్రస్తుతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఒంటి చేత్తో వైసీపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఇటీవల ప్రచారానికి బ్రేక్ తీసుకున్న సీఎం జగన్ ఈ గ్యాప్‌లో తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయిన ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ అనేక ఆసక్తికర, సంచలన విషయాలు బయటపెట్టారు. రాబోయే ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన మేనిఫెస్టో, వై నాట్ 175 సీట్లు, పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు, చంద్రబాబుపై విమర్శలు వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. అయితే సీఎం జగన్ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయిన సమయంలోనే మాజీ సీఎం చంద్రబాబు ఇంటర్వ్యూ కూడా ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అయింది. అయితే సీఎం జగన్ కు వచ్చినంతా వ్యూస్.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటర్వ్యూకు రాలేదు. ఇంటర్వ్యూ పరంగా చంద్రబాబు కంటే సీఎం జగన్ డామినేషన్ ఎక్కువ ఉందని అర్థమవుతుంది.
Also Read: KTR Fire On Congress: రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా..?: కేటీఆర్
ఈ క్రమంలోనే సీఎం జగన్ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ లాంటి వార్త బయటికి వచ్చింది. ప్రముఖ ఛానెల్ యాంకర్ సీఎం జగన్ ను ఓ ప్రశ్న అడుగుతారు. ఏంటని అంటే..? జగన్ గారు మీరు ఎప్పుడూ బయటి సందడి ఉండటం కానీ లేదా ఫోన్‌లో మాట్లాడుతుండటం కానీ మేము చూడలేదు..? ఎందుకు ఎప్పుడు అలా కనపడలేదని అడుగుతారు..? దీనికి సమాధానంగా సీఎం జగన్ ఆన్సర్ ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తను, ప్రస్తుత యువతను షాకింగ్ కు గురిచేసింది. అదేంటంటే సీఎం జగన్‌కు అసలు ఫోనే లేదంట. అంతేకాకుండా ఆయన నంబర్ కూడా ఆయనకు తెలియదంట. ఏదైనా అవసరం అయితే తన పీఆర్వోలకు కాల్ చేస్తే.. వాళ్లు ఆ విషయాన్ని జగన్‌కు చేరవేస్తారని తెలిపారు. తనకు తన భార్య భారతి, ఇద్దరు పిల్లలే ముఖ్యం అని కూడా చెప్పారు. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి దగ్గర ఫోన్ లేకపోవటం ఏంటని చర్చించుకుంటున్నారు.
We’re now on WhatsApp : Click to Join