KTR Fire On Congress: రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా..?: కేటీఆర్
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
- By Gopichand Published Date - 12:40 AM, Fri - 10 May 24

KTR Fire On Congress: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించి పలు అంశాలను ప్రస్తావించారు. రాహుల్ గాంధీ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ (KTR Fire On Congress) ఇచ్చారు. ఆయన మాట్లాడిన వీడియోను కేటీఆర్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా పంచుకుని కొన్ని ప్రశ్నలు సంధించారు.
రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా…? తెలంగాణ ప్రజలతో.. డ్రామా ఆడుతున్నారా..? వేయని “ రైతుభరోసా ”ను వేసినట్టు.. ఎందుకీ అబద్ధాలు..? ఎంతకాలం ఈ అసత్యాలు..?? అని ఫైర్ అయ్యారు. ఎక్కడన్నా ఒక్క రైతుకైనా వచ్చినదా ఎకరానికి రూ. 7500..? అని దుయ్యబట్టారు. నాట్ల నాడు.. ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని పార్లమెంట్ ఓట్ల దాకా.. డైలీ సీరియల్ లా సాగదీశారని కేటీఆర్ మండిపడ్డారు.
Also Read: Megastar Chiranjeevi: కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన విందుకి కుటుంబసభ్యులతో హాజరైన మెగాస్టార్
రాహుల్ గాంధీ గారు.. భ్రమలో ఉన్నారా…?
తెలంగాణ ప్రజలతో.. డ్రామా ఆడుతున్నారా..?వేయని “ రైతుభరోసా ”ను వేసినట్టు…
ఎందుకీ అబద్ధాలు..? ఎంతకాలం ఈ అసత్యాలు..??ఎక్కడన్నా ఒక్క రైతుకైనా వచ్చినదా ఎకరానికి ₹7.500 ?
నాట్ల నాడు.. ఇయ్యాల్సిన పెట్టుబడి సాయాన్ని
పార్లమెంట్ ఓట్ల దాకా..… pic.twitter.com/ELQXSQlAHl— KTR (@KTRBRS) May 9, 2024
చివరికి పాత “ రైతుబంధు ” పూర్తిగా అందలేదు. “ రైతు భరోసా ”కైతే అసలు అడ్రస్సే లేదు. నాడు.. 15 లక్షలు వేస్తానన్న బడాభాయ్ వేయలేదు. నేడు.. 15 వేలు ఇస్తానన్న ఛోటాబాయ్ ఇయ్యలేదు. మరి రైతు భరోసా వేసినట్టు ఎందుకీ ఫోజులు..? అసత్యాలపై కాంగ్రెస్ స్వారీ.. ఇంకెన్ని రోజులు ?? అని ఫైర్ అయ్యారు. డిసెంబర్ 9న చేస్తానన్న రెండు లక్షల రుణమాఫీ జాడేది..? కౌలు రైతులకు, కూలీలకు చేస్తామన్న సాయం సంగతేది ? ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన.. నమ్మి ఓటేసిన పాపానికి ఏంటి ఈ నయవంచన అని ప్రశ్నించారు. ఇది ప్రజాపాలన కాదు.. ముమ్మాటికీ ఇది ప్రజా వ్యతిరేక పాలన. 420 మోసపూరిత వాగ్దానాలతో.. నాలుగుకోట్ల ప్రజలను వంచించిన పాలన. ఒక్క మాట మాత్రం నిజం.. గాలిమాటల గ్యారెంటీలను నమ్మి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆగమైంది తెలంగాణ. కానీ.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజాచైతన్యం వెల్లివిరుస్తుంది. తెలంగాణకున్న ఏకైక గొంతుక BRS వైపే ప్రజాతీర్పు ప్రతిధ్వనిస్తుంది. జై తెలంగాణ.. జై భారత్.. జై బీఆర్ఎస్ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.
We’re now on WhatsApp : Click to Join