CBN: అదే జరగాలని శ్రీవారిని మొక్కుకున్న చంద్రబాబు
ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
- By Hashtag U Published Date - 12:10 AM, Sat - 18 December 21

ఏపీకి అమరావతే రాజధానిగా ఉండాలని తిరుమల శ్రీవారిని ప్రార్థించినట్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
అమరావతి పరిరక్షణ సమితి సభకోసం తిరుపతికి వెళ్లిన చంద్రబాబు 300 రూపాయల ప్రత్యేక దర్శనంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్లిన చంద్రబాబు శ్రీవారిని మహా లఘుదర్శనంలో దర్శించుకున్నారు. పూజ కార్యక్రామాల అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమని తెలిపారు. మూడు రాజధానులు పెడితే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని మాయమాటలు చెబితే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు.
రాష్ట్రానికి రాజధాని అమరావతి మాత్రమే ఉండాలని రాజధాని రైతులు 45 రోజులపాటు పాదయాత్ర చేశారని, ఇది ఏ ఒక్కరి సమస్య కాదని, ఐదు కోట్ల మంది ప్రజల సమస్య అని చంద్రబాబు తెలిపారు.