HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Central Government Issues Go Allocating Huge Amount Of Urea To Ap

CM Chandrababu : ఏపీకి భారీగా యూరియా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ

రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు.

  • Author : Latha Suma Date : 09-09-2025 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Central government issues GO allocating huge amount of urea to AP
Central government issues GO allocating huge amount of urea to AP

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల అందుబావుతో సంబంధించి సమీక్ష నిర్వహిస్తున్న సందర్భంలోనే, ఆయన నేరుగా కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోన్ చేశారు. రాష్ట్రానికి అత్యవసరంగా యూరియా సరఫరా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. కాకినాడ పోర్టుకు చేరుకున్న నౌక నుంచి రాష్ట్రానికి అత్యవసరంగా యూరియాను కేటాయించాలని కోరిన చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్ర మంత్రి నడ్డా వెంటనే స్పందించారు. దీనికి తక్షణ ప్రతిస్పందనగా, కేంద్ర ప్రభుత్వం 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.

Read Also: Malla Reddy : ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు స్పీడ్ : మల్లారెడ్డి ప్రశంసలు

ఈ అభివృద్ధికి కారణం ముఖ్యమంత్రి చొరవేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయన అధికారులను అప్రమత్తం చేస్తూ, తక్షణమే కేటాయించిన యూరియాను జిల్లాలవారీగా తరలించాలని ఆదేశించారు. ముఖ్యంగా అవసరమైన ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే, ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉండాలని, ఎవరైనా బ్లాక్ మార్కెట్‌కు తరలించే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యూరియాను చట్టవ్యతిరేకంగా నిల్వ చేసినా, విక్రయించినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,503 మెట్రిక్ టన్నుల ఎరువులు నిల్వలో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. దీనితో పాటు కేంద్రం నుంచి వచ్చిన 17,293 మెట్రిక్ టన్నులు చేరితే, రైతుల తాత్కాలిక అవసరాలకు సరిపోతుందని చెప్పారు.

రాబోయే రబీ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మొత్తం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించబడినట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన ఎరువులు సమయానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు స్పష్టంగా సూచనలు ఇచ్చారు. జిల్లా స్థాయిలో అధికారులు రైతులను కలిసేలా చేయాలని, వారి అవసరాలు తెలుసుకొని తగిన సహాయం అందించాలన్నారు. ముఖ్యంగా రైతుల్లో ఆందోళన పెరగకుండా, వారికి ధైర్యం చెప్పే విధంగా వ్యవహరించాలన్నారు. ఇక, నుంచి ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని, ప్రభుత్వ కృషి రైతుల కోసం అంకితమైందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నేరుగా కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కరించడమే కాకుండా, భవిష్యత్తు అవసరాలను కూడా ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమని మంత్రి అన్నారు.

Read Also: Group-1 Case : గ్రూప్-1 వ్యవహారంపై నేడే తీర్పు

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Acham Naidu
  • agriculture
  • andhra pradesh
  • central government
  • CM Chandra Babu Naidu
  • fertilizer allocation
  • fertilizer stock
  • JP Nadda
  • rabi season
  • Urea Shortage

Related News

Restraint is needed on water disputes: CM Revanth Reddy

జల వివాదాలపై సంయమనం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

జల వివాదాల విషయంలో కోర్టుల చుట్టూ తిరగకుండా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పరస్పరం చర్చించుకుని పరిష్కార మార్గాలు కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు.

  • Kotabommali Government Degree College

    కోటబొమ్మాళి లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ..రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Latest News

  • పండుగ వేళ, ప్రమాదానికి గురైన ఆర్టీసీ బస్సు 4 గురి పరిస్థితి విషమం

  • మరోసారి డాన్స్ తో అదరగొట్టిన అంబటి రాంబాబు

  • ఇప్పుడు చెప్పే సింపుల్ చిట్కాలు పాటిస్తే బొద్దింకలు మళ్లీ ఇంట్లో కనిపించవు

  • కొన్ని చిట్కాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ చేసుకోవచ్చు..

  • భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

Trending News

    • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd