HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Center Has Released Rs 3300 Crores To Ap And Telangana

Center Help to AP and Telangana : ఏపీ, తెలంగాణకు కేంద్రం రూ.3,300 కోట్లు విడుదల

Center Help AP and Telangana: ఇప్పటికే కేంద్ర బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

  • Author : Latha Suma Date : 06-09-2024 - 6:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Center has released Rs.3,300 crores to AP and Telangana
Center has released Rs.3,300 crores to AP and Telangana

Center Govt Help AP and Telangana Due to Floods: భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ఇప్పటికే కేంద్ర బృందం ఇరు రాష్ట్రాల్లో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణకు రూ.3,300 కోట్లు విడుదల చేసింది. తక్షణ సహాయక చర్యల కింద ఈ నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు కలిపి రూ.3300 కోట్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith sha) వెల్లడించారు.

ఇప్పటికే వరద ప్రాంతాలలో నిపుణుల బృందం పర్యటన..

కాగా, తెలుగు రాష్ట్రాల్లో సహాయ చర్యలపై ఎక్స్ ద్వారా కేంద్రం వివరాలు వెల్లడించింది. ప్రధాని ఆదేశాల మేరకు ఏపీ, తెలంగాణకు పూర్తి సహకారం అందజేయనున్నట్లు తెలిపింది. వరద ప్రాంతాలకు ఇప్పటికే నిపుణుల బృందం పంపామని, వరదలు, డ్యామ్‌లు, వాటి భద్రతను ఆ బృందం పరిశీలిస్తుందని వెల్లడించింది. వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. ఏపీలో 26 ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, 8 వైమానికదళ హెలికాప్టర్లు ఉన్నాయని హోంశాఖ స్పష్టం చేసింది. ఏపీలో 3 నౌకాదళ హెలికాప్టర్లు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ఉన్నాయని తెలిపింది. ఇప్పటివరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఏపీలో 350 మందిని రక్షించినట్లు, 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు..

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గత కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆర్థిక సహాయం చేస్తున్నప్పటికీ.. వరద బాధితులకు పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారు. దీంతో కేంద్రం నుంచి సహాయం చేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. మరో వైపు కేంద్ర మంత్రులు కూడా ప్రధానికి విన్నవించారు. దీంతో నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ఏపీలో పర్యటించారు. వరద నష్టం పై ఆరా తీశారు. ఇవాళ తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో పర్యటించారు. తాజాగా సెక్రెటేరియట్ వద్దకు చేరుకొని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో పాటు మంత్రులతో భేటీ అయ్యారు. ఈ తరుణంలోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం చేసింది. వరదలకు నష్టపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం చేసినట్టు ప్రకటించింది. తక్షణ సహాయ చర్యల కోసం కేంద్రం నిధులను విడుదల చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Rohit Sharma: గణేశుడి ఉత్సవాల్లో రోహిత్ శర్మ, నిజం తెలిస్తే షాక్ అవుతారు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Center Govt
  • Central Assistance
  • flood relief
  • floods
  • telangana

Related News

Unified Family Survey

Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

రెండవ దశలో అసలైన జనాభా లెక్కింపు ప్రక్రియ 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వ్యక్తుల వయస్సు, విద్య, ఉపాధి, మతం, భాష వంటి పూర్తి స్థాయి సామాజిక-ఆర్థిక వివరాలను సేకరిస్తారు. గత పదేళ్లకు పైగా కాలంలో రాష్ట్ర జనాభాలో వచ్చిన మార్పులు

  • Cm Revanth Key Update On Fr

    Free Scooty Scheme in Telangana : ఫ్రీగా స్కూటీలపై కీలక అప్డేట్

  • New Amrit Bharat Express.

    తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్‌.. చర్లపల్లి-కామాఖ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

  • Tgsrtc Bus Chage

    TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

Latest News

  • పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Tirumala : తిరుమల వెళ్లే భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన వార్త

  • మార్షల్ ఆర్ట్స్‌తో పవన్ ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేసిన శ్రీయా రెడ్డి

  • Open Offer : మావోయిస్టులకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఓపెన్ ఆఫర్ !!

  • Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd