Rohit Sharma: గణేశుడి ఉత్సవాల్లో రోహిత్ శర్మ, నిజం తెలిస్తే షాక్ అవుతారు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ ట్రోఫీని చేతపట్టుకుని గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే నిజం తెలుసుకుని క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు
- By Praveen Aluthuru Published Date - 05:56 PM, Fri - 6 September 24

Rohit Sharma: దేశవ్యాప్తంగా గణపతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పది రోజుల పాటు దేశవ్యాప్తంగా గణనాథుడి సంబరాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. ఇప్పటికే వినాయక విగ్రహాలు గల్లీ గల్లీకి చేరుకున్నాయి. ఎక్కడ చూసినా గణపతి విగ్రహాలతో వాతావరణం సందడిగా కనిపిస్తుంది.
ప్రతి ఒక్కరు గణపతి విగ్రహాలను తీసుకెళ్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే రోహిత్ శర్మతో ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచకప్ ట్రోఫీని చేతపట్టుకుని గణపతి ఉత్సవాల్లో పాల్గొన్నాడు. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. అయితే నిజం తెలుసుకుని క్రికెట్ అభిమానులు షాక్ అయ్యారు. టీ20 ప్రపంచకప్ సాధించిన జోష్‌లో ఉన్న ఫ్యాన్స్. భక్తిలోనూ తమదైన శైలిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. టీమిండియా ఆటగాళ్ల ఫొటోలతో ఇలా డిజైన్ చేశారు. ఈ వీడియోలో రోహిత్ శర్మ ప్రపంచకప్ ట్రోఫీని చేతపట్టుకుని ఉండగా హార్దిక్ పాండ్యా క్రేజీ ఎక్స్‌ప్రెషన్స్ తాలుకూ ఫొటోలు ఉన్నాయి.
The iconic Ganpati Bappa welcome🫡"Ganpati Bappa giving world cup trophy to Captain Rohit Sharma"🥹🇮🇳
Thank you Captain for giving this much happiness to everyone @ImRo45 🐐🇮🇳👏 pic.twitter.com/21zqvuQ89y
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) September 5, 2024
రోహిత్ కు గణపతి ట్రోఫీ అందిస్తున్నట్టుగా చూపించే ఈ వీడియో ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటుంది.. ఈ వీడియోపై ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రోహిత్ శర్మ సారథ్యంలో 2027 వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకునేలా చూడాలని భక్తులు గణేషుడిని కోరుతున్నారు.
Also Read: Stock Market LIVE: కుప్పకూలిన స్టాక్ మార్కెట్ , ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్లు నష్టం