HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cbi Enquiry Speedup In Viveka Murder Case

Viveka Murder Case : కడపకు చౌరాసియా.. వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు..!

  • Author : HashtagU Desk Date : 18-02-2022 - 2:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Viveka Murder Case
Viveka Murder Case

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ఏపీలోని కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో మకాం వేసిన సీబీఐ డీఐజీ చౌరాసియా, వివేకా హత్య కేసుపై అధికారులతో ఆరా తీస్తున్నారు. హైకోర్టు తీర్పు దృష్ట్యా వాంగ్మూలం పత్రాలను, సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో సమర్పించనున్నారు. విచార‌ణ ముమ్మ‌రంగా సాగుతున్న నేప‌ధ్యంలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరితో మరోసారి కోర్టులో వాంగ్మూలం నమోదు చేయించనున్నారని స‌మాచారం. దస్తగిరి అప్రూవర్‌గా మారుతున్న క్ర‌మంలో, 306 సెక్షన్ కింద సాక్ష్యం నమోదు చేయాలని కడప సబ్ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే సీబీఐ వాదనలతో ఏకీభవించిన క‌డ‌ప స‌బ్‌ కోర్టు, దస్తగిరిని అప్రూవర్​గా మారేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో మరోసారి మెజిస్ట్రేట్ ముందు ద‌స్త‌గిరి వాంగ్మూలం నమోదు చేయించనున్నారు.

ఇక మ‌రోవైపు వివేకా హత్య కేసు కీలక దశకు చేరుకున్నక్ర‌మంలో ఢిల్లీ నుంచి సీబీఐ డీఐజీ చౌరాసియా కడపకు రావ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. క‌డ‌ప‌లో సీబీఐ అధికారుల‌తో స‌మావేశ‌మైన‌ చౌరాసియా, వివేక హ‌త్య కేసు పురోగ‌తిపై సీబీఐ అధికారుల‌తో చ‌ర్చించారు. వారం రోజుల‌పాటు క‌డ‌ప జిల్లాలోనే ఉండి వివేకా హ‌త్య‌కేసును ప‌రీశీలించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ ఇప్ప‌టికే కోర్టులో రెండు చార్జి షీట్లు వేయ‌డంతో పాటు ఐదుగురిని నిందితులుగా చేర్చిన సంగ‌తి తెలిసిందే. అలాగే మ‌రికొంద‌రి ప్ర‌మేయం పై కూడా విచార‌ణ చేస్తుంది. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే అరెస్టులు జ‌రిగే అవ‌కాశం ఉన్న నేప‌ధ్యంలో ఢిల్లీ నుండి సీబీఐ అధికారి రావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • cbi
  • Viveka Murder Case

Related News

Amaravati

శాశ్వత ప్రజా రాజధానిగా అమరావతి!

అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటూ వైసీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • Nara Lokesh On Capital Bill

    Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాశ్వ‌తం, నా రాజ‌ధాని అమ‌రావ‌తి అజ‌రామ‌రం.. నారా లోకేష్

  • Amaravati Bill In Rajya Sabha

    Capital Amaravati: ఏపీకి గుడ్ న్యూస్.. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం.

  • Pemmasani Chandrasekhar

    AP Capital: అమరావతి రైతుల కన్నీళ్లకు పునాది.. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

  • Ap Logo

    Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

Latest News

  • రామాయణ మూవీలో ల‌క్ష్మ‌ణుడి పాత్ర చేసింది ఎవ‌రంటే?

  • పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!

  • ఐపీఎల్‌లో అరుదైన ఘ‌న‌త సాధించిన ర‌హానే!

  • భార‌త మార్కెట్లోకి కొత్త ఎల‌క్ట్రిక్ కారు.. ధ‌ర ఎంతంటే?

  • మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!

Trending News

    • వాట్సాప్‌లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్!

    • హైద‌రాబాద్‌తో కోల్‌క‌తా మ్యాచ్‌.. కేకేఆర్‌కు హోం గ్రౌండ్ క‌లిసొస్తుందా?

    • Amaravathi Capital: అమరావతి రాజధాని బిల్లుకు రాజ్యసభ ఆమోదం

    • శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు గాయం.. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరం?!

    • Condom Shortage: భారీగా పెరగనున్న కండోమ్ ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd