HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Panchayat Raj Department Wins 5 National Level Awards

Pawan Kalyan: ఏపీ పంచాయతీరాజ్‌ శాఖకు 5 జాతీయ స్థాయిలో అవార్డులు..

  • Author : Vamsi Chowdary Korata Date : 31-03-2026 - 4:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news from the AP government for BCs...
Good news from the AP government for BCs...

Panchayat Raj ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వం వహిస్తున్న ఈ శాఖకు ఏకంగా ఐదు జాతీయ పురస్కారాలు లభించాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, సేవల విస్తరణలో కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గానూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే… రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్, జల్ సంచయ్-జన్ భాగీదారి అనే రెండు కీలక విభాగాల్లో ఏపీ దేశంలోనే ప్రథమస్థానంలో నిలిచింది. మరో విభాగంలో ద్వితీయ స్థానం, ఇంకో రెండు విభాగాల్లో తృతీయ స్థానం దక్కించుకుని మొత్తం ఐదు అవార్డులను కైవసం చేసుకుంది. గ్రామ పంచాయతీలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడం, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించే రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్‌లో ఏపీ పనితీరు విశేషంగా మెరుగుపడింది. గత ప్రభుత్వ హయాంలో ఇదే విభాగంలో 24వ స్థానంలో ఉన్న రాష్ట్రం, ఇప్పుడు దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. అలాగే, తక్కువ ఖర్చుతో వర్షపు నీటిని నిల్వ చేసే పద్ధతులను ప్రోత్సహించే ‘జల్ సంచయ్ – జన్ భాగీదారీ’ కార్యక్రమంలోనూ ఏపీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.

డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సౌకర్యాలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే ‘పల్లెపండుగ 1.0’, ‘పల్లెపండుగ 2.0’ వంటి కార్యక్రమాలను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించి, ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.

గ్రామసభలలో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ‘పల్లెవెలుగు’ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే శాఖ పనితీరు గణనీయంగా మెరుగుపడి, జాతీయ స్థాయిలో ఈ పురస్కారాలు దక్కడం విశేషం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Deputy CM Pawan Kalyan
  • Andhrapradesh
  • AP government
  • Grama Swaraj Abhiyan
  • Jal Sanchay
  • National Awards
  • Palle Panduga
  • Panchayat Raj
  • rural development
  • Village Development

Related News

AP government's sensational decision regarding Brahmani Steels lands.

Kadapa: బ్రహ్మణి స్టీల్స్ భూములు పై ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాలో గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన ‘బ్రహ్మణి స్టీల్స్’ భూములను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెనక్కి తీసుకుంది. గతంలో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, 2007వ సంవత్సరంలో కర్ణాటకకు చెందిన ప్రముఖ మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ పరిశ్రమ స్థాపన కోసం ప్రభుత్వం సుమారు 13,000 ఎకరాల భూమిని కేటా

  • Good news from the AP government for BCs...

    CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Pawan Kalyan heads to Mumbai today; to undergo shoulder surgery.

    Pawan Kalyan: నేడు ముంబై కి పవన్ కల్యాణ్.. భుజానికి సర్జరీ

  • Big shock for YouTuber Ravan

    Ravana: యూట్యూబర్ రావణ్‌కు బిగ్ షాక్

  • Death of ardent 'Power' fan Niranjan... Pawan Kalyan deeply saddened.Copy

    Pawan Kalyan: పవర్ వీరాభిమాని నిరంజన్ మృతి.. తీవ్ర విషాదంలో పవన్ కల్యాణ్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd