HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >My State Andhra Pradesh Is Eternal My Capital Amaravati Is Immortal Nara Lokesh

Nara Lokesh: నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాశ్వ‌తం, నా రాజ‌ధాని అమ‌రావ‌తి అజ‌రామ‌రం.. నారా లోకేష్

  • Author : Vamsi Chowdary Korata Date : 01-04-2026 - 3:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nara Lokesh On Capital Bill
Nara Lokesh On Capital Bill

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే చారిత్రక ఘట్టం పార్లమెంటులో ఆవిష్కృతమవుతున్న వేళ, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ఆ క్షణాలను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందిన వెంటనే ఆయన చప్పట్లు కొట్టి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, సభలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి అమరావతికి మద్దతుగా మాట్లాడుతున్న దృశ్యాలను తన ఫోన్‌లో వీడియో తీశారు.

View this post on Instagram

A post shared by Nara Lokesh (@naralokesh)

‘ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని’ నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గతంలో చేసిన ఏకగ్రీవ తీర్మానానికి అనుగుణంగా, అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును నేడు లోక్ సభలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసింది.

#HistoricAmaravatiResolution
Today in the Lok Sabha, as the bill to declare #Amaravati as our rightful capital was passed, I listened to @PemmasaniOnX garu speak… and I couldn’t hold back my emotions.

This is not just a city. This is the sacrifice of thousands of farmers. This… pic.twitter.com/v1gRSFEyDr

— Lokesh Nara (@naralokesh) April 1, 2026

ఈ చారిత్రక సందర్భంపై లోకేశ్ స్పందిస్తూ, ఇది ఐదు కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజని అభివర్ణించారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అని ప్రతి ఒక్కరూ చెప్పుకునే రోజు ఇదని అన్నారు. ఇది ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షల విజయమని, రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులని, శాంతియుత పోరాటానికి లభించిన ఫలితమని పేర్కొన్నారు.

#HistoricAmaravatiResolution
అమరావతి చట్టబద్దత బిల్లుపై పార్లమెంటులో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమ‌రావ‌తి చ‌రిత్ర‌-సంస్కృతి, ఆవ‌శ్య‌క‌త స‌భ్యులు వివ‌రిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్క‌బొడుచుకున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం, దేశంలోని వివిధ పార్టీలు మద్దతుగా… pic.twitter.com/71V1Fa4P8q

— Lokesh Nara (@naralokesh) April 1, 2026

అమరావతి బిల్లుకు మద్దతుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి, ఇతర పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా అమరావతి నిలిచిందని పేర్కొంటూ, “జై ఆంధ్రప్రదేశ్.. జయహో అమరావతి” అని నినదించారు.

#HistoricAmaravatiResolution
నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ… pic.twitter.com/BJkVOw6gLI

— Lokesh Nara (@naralokesh) April 1, 2026

“అమరావతి చట్టబద్దత బిల్లుపై లోక్ సభలో జరిగిన చర్చ మొత్తం టీవీలో చూశాను. ఉత్కంఠ రేపింది. అమ‌రావ‌తి చ‌రిత్ర‌-సంస్కృతి, ఆవ‌శ్య‌క‌త స‌భ్యులు వివరిస్తుంటే ఒక ఆంధ్రుడిగా రోమాలు నిక్క‌బొడుచుకున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం, దేశంలోని వివిధ పార్టీలు మద్దతుగా నిల‌వ‌డం ఐదుకోట్ల ఆంధ్ర ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు అద్దం ప‌ట్టింది. లోక్ స‌భ వేదిక‌గా అమ‌రావ‌తి గొప్ప‌త‌నం దేశ‌మంత‌టికీ మ‌రోసారి ప‌రిచ‌య‌మైంది. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ప్ర‌జాస్వామ్య దేవాల‌యం పార్ల‌మెంటులో చ‌రిత్ర సృష్టించిన అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లు చ‌ర్చ‌లో పాల్గొన‌కుండా వైసీపీ స‌భ్యులు వాకౌట్ చేయ‌డం వారి ద్రోహ‌బుద్ధికి నిద‌ర్శ‌నం. జ‌గ‌న్ ఎన్ని జ‌న్మ‌లెత్తినా అమ‌రావ‌తిలో ఒక్క ఇటుక‌ను కూడా తాక‌లేడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధినీ ఆప‌లేడు. నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాశ్వ‌తం, నా రాజ‌ధాని అమ‌రావ‌తి అజ‌రామ‌రం” అంటూ లోకేశ్ ఓ ప్రకటన కూడా విడుదల చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati Bill Passed
  • Amaravati capital
  • Andhrapradesh
  • ap capital amaravati
  • Education Minister Nara Lokesh
  • lok sabha
  • Minister Nara lokesh
  • Nityanand Rai AP Capital Bill

Related News

Nara Brahmani features in 'Fortune India' list; Nara Lokesh posts emotional tweet.

Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, యువ పారిశ్రామికవేత్త నారా బ్రాహ్మణి మరో అరుదైన జాతీయ స్థాయి గౌరవాన్ని అందుకున్నారు. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫార్చ్యూన్ ఇండియా ఏటా ప్రకటించే ‘100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఉమెన్’ (100 మంది అత్యంత ప్రభావశీల మహిళలు) 2026 జాబితాలో ఆమెకు చోటు దక్కింది. వ్యాపారం, పరిశ్రమలు, నాయకత్వం, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేషమైన కృషి చేసి, తమదైన ము

  • Korean companies set to queue up for AP

    Nara Lokesh: ఏపీకి క్యూ కట్టనున్న కొరియా కంపెనీలు

Latest News

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

  • New Voter Registration: కొత్తగా ఓటు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా..? ఈసీ కొత్త రూల్స్..

  • Kothagudem: భద్రాద్రి జిల్లాలో బాలికపై సామూహిక లైంగిక దాడి

  • Gold Rates Today: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd