భారత మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ కారు.. ధర ఎంతంటే?
భారతదేశంలో ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. చాలా ఈవీ (EV) కార్లు SUV లేదా కాంపాక్ట్ సెగ్మెంట్లలోనే అందుబాటులో ఉన్నాయి.
- Author : Gopichand
Date : 02-04-2026 - 8:25 IST
Published By : Hashtagu Telugu Desk
VinFast VF MPV 7: వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన సంస్థ విన్‌ఫాస్ట్ భారత మార్కెట్లో తన కొత్త ఎలక్ట్రిక్ MPV ‘VF MPV 7’ బుకింగ్‌లను ప్రారంభించింది. ముఖ్యంగా ఫ్యామిలీ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ కారును తీసుకురావడం విశేషం. ప్రస్తుతం మార్కెట్లో చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు SUV లేదా ప్రీమియం కార్లకే పరిమితం కాగా.. ఈ MPV విశాలమైన స్థలం, రేంజ్, రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
నేటి నుండే బుకింగ్‌లు ప్రారంభం
VinFast VF MPV 7 కోసం కంపెనీ రూ. 21,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్‌లను ప్రారంభించింది. వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 డీలర్‌షిప్‌ల ద్వారా దీనిని బుక్ చేసుకోవచ్చు. అయితే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న దీని ధరను ఏప్రిల్ 15న వెల్లడించనున్నారు.
ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్‌లో కొత్త ఎంట్రీ
భారతదేశంలో ఎలక్ట్రిక్ MPV సెగ్మెంట్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. చాలా ఈవీ (EV) కార్లు SUV లేదా కాంపాక్ట్ సెగ్మెంట్లలోనే అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సమయంలో కుటుంబం కోసం పెద్ద, సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ కారును కోరుకునే వారికి VF MPV 7 ఒక గొప్ప వార్త.
Also Read: మీ ఫోన్ స్లో అవుతుందా? అయితే ఈ యాప్స్ తీసేయండి!
స్పేస్- డిజైన్
ఈ MPV డిజైన్ చాలా సరళంగా, ఆకర్షణీయంగా ఉంది. 4,740 మి.మీ పొడవు, 2,840 మి.మీ వీల్‌బేస్‌తో ఇందులో మూడు వరుసల సీటింగ్ సెటప్ ఉంటుంది. దీనివల్ల క్యాబిన్ లోపల విశాలమైన స్థలం లభిస్తుంది. ప్రతిరోజూ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది.
బ్యాటరీ, రేంజ్, ఛార్జింగ్
బ్యాటరీ: ఇందులో 60.13 kWh బ్యాటరీని అమర్చారు.
రేంజ్: ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఛార్జింగ్: ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ద్వారా కేవలం 30 నిమిషాల్లో 10% నుండి 70% వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది సుదీర్ఘ ప్రయాణాలను సులభతరం చేస్తుంది.
కొనే ముందు గమనించాల్సిన విషయాలు
ప్రస్తుతం అందరిలోనూ ఉన్న పెద్ద ప్రశ్న దీని ధర. ఒకవేళ దీని ధర సరైన స్థాయిలో ఉంటే ఇది సాధారణ పెట్రోల్/డీజిల్ (ICE) MPVలకు, ఇతర ఎలక్ట్రిక్ కార్లకు గట్టి పోటీనిస్తుంది. అయితే ధర మరీ ఎక్కువగా ఉంటే మాత్రం ఇది కేవలం ఒక ప్రీమియం ఆప్షన్‌గా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది.