Botsa Satyanarayana : విద్యావ్యవస్థపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను బాధల్లో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
- By Kavya Krishna Published Date - 02:29 PM, Sun - 1 June 25

Botsa Satyanarayana : రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఘాటు విమర్శలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజలకు మేలు కలిగించే కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా తొలగిస్తూ ప్రజలను బాధల్లో నెట్టుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ పథకం ఎంతో మందికి మేలు చేసిందని, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే రేషన్ అందుకోవడంతో చాలా సౌలభ్యం కలిగిందని బొత్స అన్నారు. అయితే, ఇప్పుడు ఈ పథకాన్ని నిలిపివేయడం వల్ల అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
రీవాల్యుయేషన్ వ్యవస్థలో వైఎస్సార్సీపీ హయాంలో ఐదు మార్కులకు మించి ఎప్పుడూ తేడా రాలేదని స్పష్టం చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, 20 నుంచి 30 మార్కుల వరకు తేడాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. రీవాల్యూషన్‌ను రాజకీయంగా వాడుకోవడం విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేయడమేనని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వాన్ని ఏడాది గడిచినా ప్రజలకు ఏ ఉపయోగం చేయలేదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు వేదికగా చెప్పిన “సూపర్ సిక్స్” హామీలు అంతా మోసమేనని, అవి ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని తెలిపారు. ప్రజలను వంచించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు.
పైగా వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించడం తీవ్రంగా ఖండించాల్సిన అంశమన్నారు. ఇక వైఎస్ జగన్ నేతృత్వంలో ఒక్క ఏడాదిలోనే 80 శాతం హామీలు అమలు చేశారని బొత్స గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు ప్రజలకు వెన్నుపోటు పొడిచినట్టు పాలన సాగిందని విమర్శించారు. ప్రజల సమస్యలపై కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం సమర్పిస్తామని వెల్లడించారు.
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి