HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Balineni Srinivasa Reddy Resignation From Ycp

Balineni : వైసీపీకి మరో బిగ్ షాక్‌.. బాలినేని రాజీనామా?

Balineni resignation from YCP : జగన్‌తో సమావేశమయ్యి జరిపిన చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపిస్తాయి. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని బాలినేని చెబుతున్నారు.

  • Author : Latha Suma Date : 12-09-2024 - 2:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Balineni Srinivasa Reddy Resignation from YCP?
Balineni Srinivasa Reddy Resignation from YCP?

Balineni resignation from YCP : వైసీపీకి ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నిన్న జగన్‌తో సమావేశమయ్యి జరిపిన చర్చలు విఫలమయ్యాయంటూ వార్తలు వినిపిస్తాయి. దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడంలేదని బాలినేని చెబుతున్నారు. ఈవీఎంలపై తాను చేస్తోన్న పోరాటానికి పార్టీ సహకరించడంలేదని జగన్‌ను అడిగారు బాలినేని. దీంతో పార్టీకి రాజీనామా చేస్తానని పార్టీ అధినేత జగన్‌తో చెప్పినట్లు సమాచారం. నేడో, రేపో పార్టీకి బాలినేని గుడ్ బై చెబుతారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఆ పార్టీలో చేరుతారని ప్రచారం..

ఈ క్రమంలోనే సొంత పార్టీ నేతలు కూడా ఆయన రాజీనామాపై రకరకాలుగా స్పందిస్తున్నారు. పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకే బాలినేని రాజీనామా డ్రామాలు ఆడుతున్నాడని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే.. ఏ పార్టీలో చేరతారనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బాలినేనికి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన ఆ పార్టీలో చేరుతారని ప్రచారం ఊపందుకుంది. టీడీపీ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్‌ రావుతో బాలినేని విబేధాలు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీలో వెళ్లబోడని తెలుస్తోంది. ఇక పార్టీ మారే విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కాగా, 2012లో కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలో మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేసి జగన్‌కు మద్దతుగా వైసీపీలో చేరారు బాలినేని. ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి గెలిచారు. 2019 లో వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత మంత్రి పదవి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. జగన్ బుజ్జగింపుతో మళ్లీ పార్టీలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆయన రాజీనామా అంశం తెరపైకి వచ్చింది. మరో వైపు బాలినేని వ్యతిరేకులు మాత్రం ఇదంతా పార్టీపై ఒత్తిడి పెంచేందుకు చేస్తున్న డ్రామా అని కొట్టిపారేస్తున్నారు.

Read Also: Padi Kaushik Reddy vs Gandhi : గాంధీ ఇంటికి వెయ్యి కార్లతో వెళ్తానంటూ కౌశిక్‌ రెడ్డి సవాల్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • balineni srinivas reddy
  • Janasena
  • resignation
  • tdp
  • ycp

Related News

Jada Sravan

Jada Sravan Kumar : జడ శ్రవణ్ కు సంబంధించి మరో మోసం బట్టబయలు

ప్రజా సమస్యలపై గళం విప్పుతానని చెప్పుకునే న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి

  • Unified Family Survey

    Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

  • Ap Ration Card Service Char

    Ration Card Service Charges : ఏపీలో రేషన్ కార్డు సర్వీస్ ఛార్జీలు పెంపు!

Latest News

  • తమిళ నటుడు MGR పై అనుచిత వ్యాఖ్యలు.. రాజేంద్ర ప్రసాద్‌పై విశాల్ ఫైర్

  • అమరావతిపై మళ్లీ అవే కుట్రలు.. L&T పైపులకు నిప్పు…!!

  • Nara Lokesh: నెల్లూరులో అటానమస్ మారిటైం షిప్ యార్డు.. ప్రపంచంలోనే మొదటిది.!

  • చంద్రబాబు మార్క్ పాలన.. మంత్రులకు సీఎం రేటింగ్స్.. అచ్చెన్నాయుడు ఫస్ట్, అనిత లాస్ట్!

  • భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Trending News

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd