Padi Kaushik Reddy vs Gandhi : గాంధీ ఇంటికి వెయ్యి కార్లతో వెళ్తానంటూ కౌశిక్ రెడ్డి సవాల్
Padi Kaushik Reddy vs Gandhi : ఐదేండ్ల తర్వాత కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. మీ భరతం పట్టడం ఖాయం. ఇది రాసిపెట్టుకోండి. ఇప్పుడు పార్టీ మారిన వారందరికీ నాలుగేండ్ల తర్వాత సినిమా చూపిస్తాం అని హెచ్చరించారు.
- By Sudheer Published Date - 02:45 PM, Thu - 12 September 24

Padi Kaushik Reddy vs Gandhi : బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి – శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (Padi Kaushik Reddy vs Gandhi) ల మధ్య సవాళ్లు..ప్రతి సవాళ్లు చేస్తున్నారు. నిన్న తెలంగాణ భవన్ లో కౌశిక్..గురువారం ఉదయం గాంధీ నివాసానికి వెళ్లి ఆయన ఇంటిపై గులాబీ జెండా ఎగరవేసి అక్కడి నుండి తెలంగాణ భవన్ కి వచ్చి ప్రెస్ మీట్ పెడతానని సవాల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సవాల్ కు అదే స్థాయిలో గాంధీ ప్రతి సవాల్ చేసారు. దమ్ముంటే నా ఇంటికి రా.. లేదంటే నేనే నీ ఇంటికి వస్తాను అంటూ సవాల్ విసిరారు. ఇలా ఇరు నేతల సవాళ్లు కొనసాగడం తో ఈరోజు ఉదయం కౌశిక్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. అయితే గాంధీ మాత్రం తన అనుచరులతో కౌశిక్ ఇంటి పైకి వచ్చారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరి… ఇంటి అద్దాలను కుర్చీలతో పగులగొట్టి నానా బీబత్సం చేసారు. దీంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఎమ్మెల్యే గాంధీ ని కొండాపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పార్టీ మారిన వారందరికీ నాలుగేండ్ల తర్వాత సినిమా చూపిస్తాం
అనంతరం కౌశిక్ మీడియా తో మాట్లాడుతూ..రేపు ఉదయం అరికెపూడి ఇంటికి వెయ్యి కార్లతో వెళ్తానని కౌశిక్ రెడ్డి సవాల్ చేసారు. కాంగ్రెస్ లో చేరానని గాంధీయే స్వయంగా మీడియాకు చెప్పి ఇపుడు మాట మారుస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్టీ మారిన వారు హై కోర్టు తీర్పు తర్వాత గజగజ వణుకుతున్నారని అన్నారు. స్పీకర్ నిర్ణయం దాకా ఆగకుండా పిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉపఎన్నికలను ఎదుర్కోవాలని అన్నారు. ఎపుడు ఎన్నికలు వచ్చిన ఆ పది సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్నారు. అరికేపూడి గాంధీ నకిలీ గాంధీ అని చురకలు అంటించారు. కేసీఆర్ విడిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేను చేర్చుకున్నారని నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని అన్నారు. ఐదేండ్ల తర్వాత కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. మీ భరతం పట్టడం ఖాయం. ఇది రాసిపెట్టుకోండి. ఇప్పుడు పార్టీ మారిన వారందరికీ నాలుగేండ్ల తర్వాత సినిమా చూపిస్తాం అని హెచ్చరించారు.
ప్రజా పాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి
ప్లాన్ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకొచ్చారని తెలిపారు. దాడులు చేస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. చంపే ప్రయత్నం చేస్తే.. మేమేందో కూడా చూపిస్తామన్నారు. గూండాలతో వచ్చి దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. హారతులతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటే.. తమపై రాళ్ల దాడులు చేస్తారా అన్నారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని, సామన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజా పాలన అంటే ఇదేనా రేవంత్ రెడ్డి అని నిలదీశారు.
Read Also : B.Y. Vijayendra : హిందువులను రెచ్చగొట్టడానికి చేసిన దురుద్దేశపూరిత చర్య