TDP MP Kalishetty: టీడీపీ ఎంపీ కలిశెట్టిని అభినందించిన ఏపీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్.. రీజన్ ఇదే!
కాలుష్యాన్ని తగ్గించేందుకు అతను చేసిన ఈ ప్రయత్నం సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రజా ప్రతినిధులకు నడివీధిలో ప్రతి పౌరుడికి స్ఫూర్తి నిలుస్తోంది.
- By Gopichand Published Date - 06:10 PM, Wed - 27 November 24

TDP MP Kalishetty: దేశ రాజధాని ఢిల్లీ తన పురాతన సంప్రదాయాలు, ఆధునిక నిర్మాణాలు, రాజకీయ చింతనలతో ఒక ప్రత్యేకత కలిగిన నగరంగా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ మహానగరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో కాలుష్యం కూడా ఒకటి. రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీ, పారిశ్రామిక ఉద్గారాలు, ఇతర మానవ చర్యల వల్ల ఢిల్లీ నగరం గాలి కాలుష్యంలో అత్యధికంగా ఇబ్బంది పడుతోంది. ఈ పరిస్థితుల మధ్య కాలుష్యాన్ని తగ్గించేందుకు TDP పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తీసుకున్న ముందడుగు ప్రాతినిధ్యానికి, ప్రకృతికి సంబంధించి ఒక మంచి సందేశాన్ని అందించింది.
ఢిల్లీ నగరంలో రోజూ పార్లమెంట్ సమావేశాలకు సైకిల్‌పై ప్రయాణం చేసే ఎంపీ అప్పలనాయుడు (TDP MP Kalishetty) ఒక ప్రత్యేకమైన శైలిని అవలంభించారు. ఈ నూతన ఆలోచనకు గౌరవం ప్రకటిస్తూ బుధవారం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసేందుకు పార్లమెంట్ కు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు పార్లమెంట్ ఆవరణలో ఎంపీ అప్పలనాయుడుని అభినందించారు.
కాలుష్యాన్ని తగ్గించేందుకు అతను చేసిన ఈ ప్రయత్నం సామాన్య ప్రజలకు మాత్రమే కాకుండా ఇతర ప్రజా ప్రతినిధులకు నడివీధిలో ప్రతి పౌరుడికి స్ఫూర్తి నిలుస్తోంది. ఇది మనకు ప్రకృతి పట్ల, మన చుట్టూ ఉన్న పర్యావరణం పట్ల ఉన్న బాధ్యతను గుర్తు చేస్తుంది. ఈ సందర్భంలో దేశ రాజకీయాలలో భాగస్వామ్యంగా ఉండి ప్రకృతికి సేవచేయాలనే ఆలోచన అందరికీ స్ఫూర్తిదాయకం. కేవలం అభినందనలకే కాకుండా ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా ప్రజల అభిరుచిని మార్చే పునాది కావాలి. “ఒక వ్యక్తి మార్పు, సమాజం మార్పు” అనే భావనకు ఎంపీ అప్పలనాయుడు సైకిల్ ప్రయాణం ఒక చక్కని ఉదాహరణగా నిలుస్తుంది.